ఎంతో మంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారో లెక్కనే లేదు.ఈక్రమంలోనే.. పవన్ కళ్యాణ్ ఏరీ కోరి అధికారి మైలవరపు కృష్ణతేజను స్పెషల్ గా తన ఓఎస్టీగా నియమించేలా చర్యలు తీసుకున్నారు.
అలెప్పిలో రిసార్టు మాఫియా, కరోనా సమయంలోను ఆయన చేసిన సేవలు మరువలేనివి. కరోనా కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రెటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్ గా పేరు తెచ్చుకున్నారు.
2019లో కేరళవాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్ ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను బోట్ రేస్ కి అతిథులుగా పిలిచారు. పర్యాటకులను అలెప్పీ వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు. కేరళ పర్యాటకంలో తన మార్కును చూపించారు.
వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ప్రత్యేకచర్యలు చేపట్టారు.'ఐయామ్ ఫర్ అలెప్పీ' పేరుతో ఓ ఫేస్ బుక్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళవాసులను ఆకర్షించింది. అలెప్పీ కి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. దివంగత రామోజీరావు, బాహుబలి టీమ్ ద్వారా రాజమౌళి, యాంకర్ సుమ ఇలా ఎంతో మంది అలెప్పీలో బాధితుల కోసం తమవంతు సహయం చేసేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66 ర్యాంకు సాధించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. చాలా తక్కువ రోజుల్లోనే కృష్ణతేజ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించారు. 2018లో వచ్చిన కేరళ వరదలు వచ్చినప్పుడు.. 48గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ నేపథ్యంలో కేరళలోని త్రిసూర్ లో ఐఏఎస్ గా ఉన్న ఏపీ క్యాడర్ అధికారి మైలవరపు కృష్ణతేజను డిప్యూటేషన్ మీద ఏపీకి తెచ్చుకునేలా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. పవన్ కళ్యాణ్..దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ అనేక ఘనతలు సాధించారు.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ దగ్గర ఓఎస్డీగా మైలవరపు కృష్ణతేజ ను నియమించారు. కొణిదల పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రజలకు మంచి చేయాలని ఫైర్ మీద ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సైతం.. పవన్ కు..
డిప్యూటీ సీఎంతోపాటు గ్రామీణాభివృద్ధి,గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ-పర్యావరణం,సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలు కేటాయించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది.ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. దీనిలో భాగంగానే పవన్ కు చంద్రబాబు డిప్యూటీ సీఎంతో పాటు, మరో నాలుగు శాఖలను సైతం కేటాయించారు. ఇటీవల పవన్ ఆ శాఖల బాధ్యతలను సైతం స్వీకరించారు.
Authored By:
Inamdar Paresh
Publish Later:
No
Publish At:
Friday, June 21, 2024 - 14:59
Mobile Title:
Pawan Kalyan: పవన్ పేషీలో పవర్ ఫుల్ ఐఏఎస్.. కేంద్రానికి స్పెషల్ గా లేఖ.. ఎందుకంటే?
Created By:
Indamar Paresh
Updated By:
Indamar Paresh
Published By:
Indamar Paresh
Request Count:
52
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.