Anjeer: నానబెట్టిన అంజీర్‌తో షుగర్‌ వ్యాధిగ్రస్థులకు నమ్మలేని 5 ఆరోగ్య ప్రయోజనాలు..

Anjeer Benefits For Diabetes: షుగర్‌ వ్యాధిగ్రస్థుల డైట్‌ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు కొన్ని రకాల డైట్‌లో చేర్చుకోకూడదు. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తప్పకుండా వారి జాబితాలో ఉండాల్సిందే. అయితే, నానబెట్టిన అంజీర్‌ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 

1 /6

Anjeer Benefits For Diabetes:  చక్కెర వ్యాధితో బాధపడుతున్నవారు ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజంతా ఆరోగ్యంపై వాళ్లు తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, ఉదయం నానబెట్టిన అంజీర్‌ పండు తినడం వల్ల షుగర్‌ రోగులకు వరం.   

2 /6

డయాబెటీస్‌తో బాధపడేవారు ముఖ్యంగా వారి డైట్‌లో చక్కెర తక్కువ ఉండే ఆహారాలు చేర్చుకోవాలి అంటారు. కార్బొహైడ్రేట్‌ష్‌ కూడా తక్కువ ఉన్న ఆహారాలు తక్కువ ఉన్న ఫుడ్స్‌ వారి డైట్‌లో ఉండాల్సిందే. అయితే, షుగర్‌ ఉన్నవారు తమ డైట్‌లో గింజలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. తద్వారా వారి శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.   

3 /6

ముఖ్యంగా అంజీర్‌ పండ్లలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో బరువు తగ్గుతారు, కడుపు సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పేగు కదలికలకు అంజీర్‌ సహాయపడుతుంది.  

4 /6

దీంతో కడుపులో మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది. ఫైబర్‌ ఎక్కువ ఉండే ఆహారాలు మన డైట్‌లో ఉంటే, అలాంటి ఫుడ్స్ తింటే ఎక్కువ సమయంపాటు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. దీంతో బరువు కూడా ఎక్కువ పెరగకుండా ఉంటారు.  

5 /6

అంతేకాదు అంజీర్‌ పండు నేరుగా కాకుండా నానబెట్టి తీసుకోవడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంజీర్‌ పండులో పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది.  

6 /6

చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంజీర్‌ పండు రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఇన్సూలిన్‌ నిరోధకత కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.