Ys jagan Sankranthi Celebrations: అచ్చ తెలుగు పంచెకట్టుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ఘనంగా జరుపుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సతీమణి వైఎస్ భారతితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు పంచెకట్టుతో..జగన్ దర్శనమిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు.

Ys jagan Sankranthi Celebrations: సంక్రాంతి సంబరాల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ఘనంగా జరుపుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సతీమణి వైఎస్ భారతితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు పంచెకట్టుతో..జగన్ దర్శనమిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు.

1 /9

మేళ తాళాల మధ్య వేద పండితులు పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.

2 /9

రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పిన జగన్..ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు

3 /9

గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గోశాలను తీర్చిదిద్దారు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తులసి కోట, ధాన్యపు రాశులు, చెరుకు గడలు, రంగవల్లులు, ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, డోలు వాద్యాలు, కోలాటాలు, హరిదాసులు, గంగిరెద్దులు, అరిసెల వంటకాలతో ఆ ప్రాంతం పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టింది. 

4 /9

కోలాటం, డోలు విన్యాసాలు, గంగిరెద్దుల విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఆలపించిన సంక్రాంతి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

5 /9

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు స్వయంగా హరిదాసుకు బియ్యం అందజేశారు.

6 /9

చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రదర్శన ఇచ్చిన చిన్నారులు, కళాకారులను ఆశీర్వదించి ముఖ్యమంత్రి ఫొటోలు దిగారు.

7 /9

తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు పంచెకట్టుతో..జగన్ దర్శనమిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు.

8 /9

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగుదనం ఉట్టిపడేలా...తెలుగు పంచెకట్టుతో సతీమణి వైఎస్ భారతితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

9 /9

గోపూజ నిర్వహించి, గో సేవ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. దాదాపు గంటన్నర సేపు సీఎం దంపతులు వేడుకలను తిలకించారు.