IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
తెలంగాణ నుంచి ఏపీకి ఇటీవల పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. ఈ అధికారులు ఏపీ వెళ్లకుండ ఉండేందుకు క్యాట్ తో పాటు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు.
కానీ డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందే అంటూ ఇటు క్యాట్ మరోవైపు సుప్రీంకోర్టులు సైతం అధికారులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొన్నిరోజుల క్రితమే ఈ అధికారులు ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు. అయితే.. చాలా రోజుల వరకు కూడా ఈ అధికారులకు ఏపీ సర్కారు ఎలాంటి బాధ్యతల్ని అప్పగించకుండా హోల్డ్ లో పెట్టింది.
దీంతో ఇరు తెలుగు స్టేట్స్ ల సీఎంలు పరస్పర అంగీకారంలో మళ్లీ అధికారుల్ని పాత స్థానాల్లో కొనసాగిస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో డైనమిక్ ఐఏఎస్ ఆమ్రపాలీ విషయంలో మాత్రం తెలుగు స్టేట్స్ లలో కాకుండా.. దేశంలో కూడా ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో అంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
కొంత మంది ఆమ్రపాలీకి చంద్రబాబు సర్కారు తన పేషీలో ఉంచుకుని కీలక బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. మరొసారి పవన్ కళ్యాణ్ పేషీలో ఆమ్రపాలీకి ఏదైన శాఖలు కేటాయించ వచ్చని కూడా వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో అనూహ్యంగా ఆమ్రపాలీకి టూరిజం శాఖ బాధ్యతలు అప్పగిస్తు చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ టూరిజం శాఖకు ఎండీగాను, టూరీజం అథారిటీకి సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం టూరిజం శాఖ ను జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేశ్ చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో టూరిజం పరంగా ఏపీని డెవలప్ చేసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
ఆమ్రపాలీ తెలంగాణలో జీహెచ్ఎంసీ బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే బల్దియాలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ఇప్పుడున్న టూరిజం ప్రాంతాల్ని డెవలప్ చేసి, విదేశీ టూరిస్టుల నుంచి ఏపీకి ఆదాయం వచ్చేవిధంగా బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తుందని భరోసాతో ఆమ్రపాలీకి టూరిజంశాఖను కేటాయించిట్లు తెలుస్తొంది.