Shalini Pandey Mirror Photoshoot అర్జున్ రెడ్డి సినిమాతో షాలినీ పాండే ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ కల్ట్ క్లాసిక్‌గా సినిమా నిలిచినా కూడా షాలినీ పాండేకు ఆ సినిమాను ఎలా వాడుకోవాలో అర్థం కాలేదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆ సినిమా క్రేజ్‌ను వాడుకున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమాకు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ, ప్రీతిగా షాలినీ పాండే అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా సక్సెస్‌ను షాలినీ వాడుకోలేకపోయింది.
షాలినీ పాండేకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కళ్యాణ్ రామ్ 118 సినిమాలో కనిపించింది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించింది.
షాలినీ పాండేకు కోలీవుడ్‌లో అంతో ఇంతో ఆఫర్లు వచ్చాయి. 100 పర్సెంట్ లవ్ సినిమాను తమిళంలో రీమేక్‌గా చేయగా.. తమన్నా పాత్రను కోలీవుడ్‌లో షాలినీ పాండే పోషించింది.
షాలినీ పాండే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంటుంది. బికినీలో కనిపించి అవకాశాలను పట్టేయాలని చూస్తుంటుంది. కానీ షాలినీ అందాల ప్రదర్శన అంతా వృథాగా పోతోన్నట్టు అనిపిస్తోంది.
షాలినీ పాండే తాజాగా కనిపించిన తీరు, అద్దం ముందు ఉండి.. అద్దంలో కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. షాలినీ పాండే ఎద అందాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో చెప్పాల్సిన పని లేదు.