Bajaj Pulsar N160 Single Seat Version 2025: మార్కెట్లోకి బజాజ్ పల్సర్ N160 సింగిల్-సీట్ కొత్త వెర్షన్‌ను విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది. ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bajaj Pulsar N160 Single Seat Version 2025: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ బజాజ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ కంపెనీ విడుదల చేసిన ప్రతి బైక్ మార్కెట్లో సక్సెస్ అయ్యింది. విజయానికి మారు పేరుగా నిలుస్తున్న బజాజ్ తమ అధిపత్యాన్ని మార్కెట్లో ఇలాగే కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోటర్‌సైకిల్స్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వస్తోంది. గతంలో విడుదల చేసిన పల్సర్‌కు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉండడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ బజాజ్ కంపెనీ మరో ముందడుగు వేసింది.
ప్రీమియం ఫీచర్స్‌తో పల్సర్ N160 మోటార్‌సైకిల్‌ను సింగిల్-సీట్ వెర్షన్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది గతంలో ఉన్న మోటర్‌సైకిల్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం ఫీచర్స్‌తో ఈ బజాజ్ కంపెనీ ఈ బైక్‌ను పరిచయం చేసింది.
బజాజ్ పల్సర్ N160 సింగిల్-సీట్ వెర్షన్ మోటార్‌సైకిల్ అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదలైంది. అంతేకాకుండా ధర పరంగా చూసిన స్టాండర్డ్ బేస్ వేరియంట్ కంటే దాదాపు రూ.10,000 తక్కువ ధర ఉండబోతున్నట్లు కంపెనీ తెలిపింది. కానీ ఈ వేరియంట్లో కంపెనీ స్ప్లిట్ సీట్లను సింగిల్-పీస్ సీటుతో భర్తీ చేసింది. దీంతో ఈ బైక్ మరింత అద్భుతంగా మారింది.
బజాజ్ సింగిల్ సీటు పల్సర్ N160 మోటర్‌సైకిల్‌లో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ బైక్‌లో సింగిల్ సీటు రావడం వల్ల రైడర్‌కు ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ఎంత దూరం రైడ్ చేసిన అలసట ఉండదు.
ఇక ఈ పల్సర్ N160 సింగిల్-సీట్ వేరియంట్ బైక్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీని ఫ్రంట్ భాగంలో స్టాండర్డ్ 37mm టెలిస్కోపిక్ ఫోర్క్‌లు ఉండబోతున్నాయి. అంతేకాకుండా రెండు చక్రాలకు ప్రత్యేకమైన డిస్క్ బ్రేక్‌లను బజాజ్ కంపెనీ అందిస్తోంది. అలాగే బ్యాక్ సైడ్ల్లో ప్రత్యేకమైన Nitrox మోనోషాక్ సస్పెన్షన్ కూడా లభిస్తోంది.
ఈ పల్సర్ N160 కొత్త వేరియంట్లో బజాజ్ కంపెనీ డ్యూయల్-ఛానల్ ABSను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మోటర్‌సైకిల్ 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ విడుదలైనట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ మోటర్‌సైకిల్ ఎంతో శక్తివంతమైన 164.82 cc, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ఇంజన్ దాదాపు 14.65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో బజాజ్ కంపెనీ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందిస్తోంది. అలాగే స్పెషల్ బ్లూటూత్ సపోర్ట్‌తో పాటు అనేక కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.