Nara Brahmani: బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణికి ఇష్టమైన హీరో ఎవరంటే..?

Balakrishna daughter: బాలకృష్ణ పెద్ద కూతురు.. నారా బ్రాహ్మణికి బాలకృష్ణ కాకుండా ఒకసారి హీరో కొడుకు అంటే చాలా ఇష్టమని, వారి యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టమని తెలియజేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరు.. బాలకృష్ణ కూతురు కూతురు, చంద్రబాబు నాయుడు కోడలు ఏమి చెప్పిందో.. ఒకసారి చూద్దాం..

1 /5

రెండు రాష్ట్ర తెలుగు ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి గురించి చెప్పాల్సిన పనిలేదు.. నారా లోకేష్ భార్యగా సీఎం చంద్రబాబు కోడలిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే..బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది బ్రాహ్మణి. బాలయ్యకు మొదటి నుంచి నారా బ్రాహ్మణి వీర అభిమాని అన్న సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ కాకుండా నారా బ్రాహ్మణికి టాలీవుడ్ లో మరొక ఫేవరెట్ హీరో అంటే చాలా ఇష్టమట. మరి ఇంతకు బ్రాహ్మణికి ఫేవరెట్ హీరో ఒకసారి చూద్దాం.   

2 /5

బ్రాహ్మణికి తన తండ్రి బాలయ్య కాకుండా మరొక హీరో అంటే కూడా చాలా ఇష్టమట. ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈయన నటన పరంగా, డాన్స్ పరంగా తనకి చాలా ఇష్టమని,చిరంజీవి హీరోగా సినిమా విడుదల అవుతుందంటే చాలు మొదటి రోజే ఈమె సినిమా చూడడానికి వెళుతుందట.  ఈ విషయాన్ని బాలయ్యే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు. 

3 /5

అలాగే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అన్నా కూడా చాలా ఇష్టమని ఈయన డైలాగులు తనని బాగా ఆకట్టుకుంటాయని రామ్ చరణ్ ప్రతి సినిమాలోని యాక్టింగ్ మెచ్యూరిటీ తనకి చాలా ఇష్టమని తెలియజేశారు బాలయ్య. 

4 /5

మొత్తానికి బాలయ్య కాకుండా నారా బ్రాహ్మణికి చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ అంటే ఇష్టమని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. ప్రస్తుతం బాలయ్య చిత్రాల విషయానికి వస్తే.. డైరెక్టర్ బాబి డైరెక్షన్లో డాకు మహారాజ్ సినిమాలో నటించారు.   

5 /5

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ హైప్స్ ఉన్నాయి. ఇక బాలయ్య కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఇప్పటికే మూడుసార్లు గెలవడం జరిగింది. అటు రాజకీయాలు ఇటు సినిమాలలో సక్సెస్ఫుల్ గా…వెళ్తున్నారు బాలయ్య.