Banana Leaves: దక్షిణాది సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అరటి ఆకుల్లో భోజనం చేస్తుంటారు. ఇది ఎక్కువగా పెళ్లిళ్లు లేదా హోటల్స్‌లో కన్పిస్తుంటుంది. అరటి ఆకుల్లోనే భోజనం చేయడం వెనుక కారణమేంటి, ఎందుకు అనేది తెలుసుకుందాం.
ఈ ఆకులు పరిమాణంలో కూడా పెద్దవిగా ఉంటాయి. అందుకే వేర్వేరు సైజుల్లో కట్ చేస్తుంటారు. పెళ్లిళ్లలో భోజనం వడ్డించేందుకు చాలా అనువుగా ఉంటాయి.
ఈ ఆకుల ఉపరితలం మైనం రాసినట్టుగా మృదువుగా ఉంటాయి. ఫలితంగా వీటిని శుభ్రం చేయడం చాలా సులభం. హై జీనిక్గా ఉంచవచ్చు. అందుకే దక్షిణ భారతదేశంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు
అరటి ఆకులు సాధారణంగా వాటర్ ప్రూఫ్ గుణాలు కలిగి ఉండటం వల్ల భోజనం చేసేందుకు చాలా అనువుగా ఉంటాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఇందులో భోజనం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలుంటాయి. తిన్న ఆహారం జీర్ణం కూడా బాగుంటుంది
అరటి ఆకులు విస్తృతంగా లభించేవి కావడంతో ధర కూడా చాలా తక్కువ. ఒకసారి వినియోగించి పాడేయవచ్చు. ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి.
అరటి ఆకుల్లో ఉండే పోలీఫెనోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. గ్రీన్ టీ సహా కొన్నీ ఆకు కూరల్లో ఉంటుంది. చాలా రకాల లైఫ్‌స్టైల్ వ్యాధుల్ని నియంత్రిస్తుంది. ఆరటి ఆకులు పెద్దవిగా ఉడటం వల్ల భోజనానికి ఉపయోగిస్తారు.
ఆరటి ఆకుల్ని భోజనం కోసం వినియోగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. దక్షిణాదిలో ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఆరటి ఆకుల్ని పవిత్రంగా, శుచి శుభ్రత కలిగినవిగా పరిగణిస్తారు. అందుకే దేవతలకు ప్రసాదం సమర్పించేటప్పుడు అరటి ఆకుల్లోనే ఇస్తుంటారు. ఇప్పటికీ దక్షిణాదిన ప్రత్యేక సందర్భాలు, పెళ్లిళ్లు, వేడుకల్లో ఇదే ఆచారం పాటిస్తారు