Bank Holiday 25th January: బ్యాంకులకు ఆర్బీఐ మంజూరు చేసిన సెలవులు ఉంటాయి. మీకు బ్యాంకులో ఏమైనా పనులు ఉంటే ముందుగానే చూసుకోండి. ఎందుకుంటే బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈరోజు 23, 25 రెండు రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి.
ప్రధాన బ్యాంకులు అయిన ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు బంద్ ఉంటాయి. కోల్కత్తా, త్రిపుర, ఒడిశాలో నేడు బ్యాంకులు బంద్ ఉన్నాయి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, వీర్ సురేంద్ర సాయి జయంతి సందర్భంగా గురువారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. జనవరి 25వ తేదీ నాలుగో శనివారం కాబట్టి సెలవు వస్తుంది. జనవరి 26వ తేదీ ఆదివారం అందులో రిపబ్లిక్ డే కూడా కలిసి వస్తుంది.
అయితే, బ్యాంకులు బంద్ ఉన్నా బ్యాంకు సంబంధిత పనులు మాత్రం పూర్తి చేసుకోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు యూపీఐ పేమెంట్స్ పై కూడా ఎలాంటి ప్రభావం చూపదు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా యథావిధిగా కొనసాగుతాయి.
బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని స్థానిక పండుగలు, ప్రత్యేక రోజులు సందర్భంగా సెలవులు ఉంటాయి. అయితే, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం, ప్రతి ఆదివారాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు సెలవులు ఉంటాయి. అయితే, బ్యాంకులకు కేవలం ఐదు రోజులు పని దినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ విషయమై ఫిబ్రవరి నెలలో రెండు రోజులు బ్యాంకు ఉద్యోగులు సమ్మె కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఈ ఐదు రోజుల పని దినాలు అమలు అయితే, బ్యాంకులకు అన్నీ శనివారాలు, ఆదివారాలు సెలవులు ఉంటాయి. కేవలం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.