కరోనావైరస్ బారీన పడిన 13 మంది ఐపిఎల్ సభ్యులు . ఐపిఎల్ విషయంపై స్పష్టత ఇచ్చిన క్రికెట్ బోర్డు
మొత్తం 196 మందికి కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా అందులో 13 మంది కి పాజిటీవ్ వచ్చింది. ఇందులో ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. ఐపిఎల్ నిర్వహణపై సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఇలాంటి మహమ్మారి సమయంలో ఇంత పెద్ద లీగ్ ను నిర్వహించే అవసరం ఏముంది. ఐపిఎల్ ను ఒక సంవత్సరం వాయిదా వేయలేరా...ఇలాంటి ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు. కానీ ఐపిఎల్ నిర్వహించకపోతే రూ.4000 కోట్లు నష్టం కలుగుతుంది అని BCCI తెలిపింది. చాలా మంది క్రికెటర్లు ఇళ్లు ఐపిఎల్ వల్లే నడుస్తోంది అని తెలిపింది.
కోవిడ్-19 సోకిన క్రికెటర్ పేరును బోర్డు వెల్లడించలేదు. వారిలొ ఇద్దరు చెన్నై ప్లేయర్స్ అనేది మాత్రం స్పష్టం. కోవిడ్-19 సోకిన వారిని ఎవరూ కాంటాక్ట్ అవ్వలేదు అని తెలిపింది బోర్డు.
మా మెడికల్ టీమ్ ప్రతీ క్రికెటర్ అండ్ స్టాఫ్ ను పర్యవేక్షిస్తున్నాం అని క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ 13 మందిని ఐసోలేషన్ లో ఉంచామని తెలిపింది. ఈ టోర్నమెంట్ ను పూర్తిగా సురక్షితంగా నిర్వహిస్తాం అని తెలిపింది.
ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్ స్టార్ బ్యాట్స్ మెన్ సురైష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారత్ కు తిరిగివచ్చేశాడు. చూస్తోంటో చెన్నై టీమ్ బాగా ఇబ్బందుల్లో ఉంది అనిపిస్తోంది.