Mahabharatha Epic: మహభారతంతో భీష్ముడు కీలకంగా వ్యవహరించాడని పురాణాల్లో చెబుతుంటారు. తన తండ్రి శంతనుడికి ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడు. అదే విధంగా తన కురు రాజ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతుంటాడు.
భీష్ముడు గొప్ప యోధుడు. తాను కోరుకున్నప్పుడు మాత్రమే మరణంపొందే వరాన్ని పొందాడు. పాండవులు, కౌరవుల మధ్య యుద్ధంలో అర్జునుడి చేతిలో బాణాలతో తీవ్ర గాయాలపాలై భీష్ముడు అంపశయ్యపై పడుకొని ఉంటారు.
అప్పుడు ఆయనను శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తారు. ఉత్తరాయణం అనేది ఎంతో పుణ్యకాలమని చెబుతుంటారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభమయ్యాక, అష్టమి రోజున తన ప్రాణాలను వదులుతారు.
ఉత్తరాయణం అనేది దేవతలకు పగలుగా చెబుతుంటారు.ఈ కాలంలో ఏ పని చేసిన మనకు రెట్టింపు ఫలితం కల్గుతుంది. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి మనస్సులో శరణువేడుతూ విష్ణుసహస్రనామం పఠిస్తాడు..
భీష్ముడిని పితామహ అని కూడా పిలుస్తారు. అందుకే ఆయనను భీష్మాష్టమి రోజున తర్పణాలు వదిలితే గొప్ప ఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతుంటారు. పిల్లలు లేని వారు, పితృదోషం ఉన్న వారు ఈరోజున తర్పణాలు వదలాలి..
కొందరికి పెళ్లై ఎన్ని సంవత్సరాలైన పిల్లలు కలగరు. అలాంటి వారు, భీష్ముడిని స్మరించుకుని నల్ల నువ్వులతో తర్పణాలు వదలాలి. అంతే కాకుండా.. విష్ణుసహస్రనామ పూజలు, తులసీని భక్తితో పూజించాలి.
భీష్మాష్టమి రోజున సంకల్పం చెప్పుకుని, తర్పణం వదిలితే.. ఏడాదిలోపు పిల్లలు లేని వారికి సంతానం, పితృదోషం తొలగిపోయి జీవితంలో కలలో కూడా ఊహించని గొప్పమార్పులు సంభవిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.