Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. బీమా లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌ బంద్

Central Govt on Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇన్సూరెన్స్‌ విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా చేసింది. లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేయలేరని.. ఫాస్టాగ్‌కు కూడా ఇన్సురెన్స్ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చనేసింది. అదేవిధంగా ఇన్సురెన్స్ లేకుండా వాహనం నడిపితే.. కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇలా..
 

1 /5

వాహనం నడిపే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. ఇన్సూరెన్స్ ఉంటే జరిగిన నష్టానికి బీమా కంపెనీల నుంచి పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది.  

2 /5

బీమాతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందుకే ఇన్సూరెన్స్ లేకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

3 /5

మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం.. బీమా పాలసీ తప్పనిసరి. కానీ 2024 నాటికి మన దేశంలో 40 కోట్ల వాహనాలు ఉండగా.. కేవలం 50 శాతం వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.  

4 /5

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. బీమా లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌, ఫాస్టాగ్ సౌకర్యాలు నిలిపి వేయనుంది.  

5 /5

ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే.. మొదటిసారి రూ.2 వేల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అదే రెండోసారి అయితే రూ.4 వేల జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.