Silk Smitha last call: దశాబ్దన్నర పాటు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సిల్క్ స్మిత, గ్లామర్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, మరణం వెనుకున్న కథలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఈ క్రమంలో.. ఈ హీరోయిన్ చివరిగా ఒక స్టార్ హీరోకి ఫోన్ చేసింది అన్న విషయం ఆ స్టార్ హీరోనే చెప్పడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిచింది.
సిల్క్ స్మిత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఆమె కంటూ ప్రత్యేక స్నానం సంపాదించుకుంది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆమె సినీ ప్రయాణం మలయాళ చిత్రంతో మొదలైంది. తొలి సినిమానే ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వరదలా వచ్చాయి. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలలో బోల్డ్ క్యారెక్టర్‌లతో.. అలరించి ప్రేక్షకాదరణ పొందారు.
తెలుగులో సీతాకోకచిలుక చిత్రంతో పేరు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత మాస్ ప్రేక్షకులకు ఫేవరేట్ హీరోయిన్‌గా మారారు. స్టార్ హీరోలతో కలిసి నటించే స్థాయికి ఎదిగిన సిల్క్ స్మిత, దాదాపు 360కి పైగా సినిమాల్లో నటించారు. సిల్క్ స్మిత స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు. అప్పట్లో ఆమె నటించిన చిత్రాలు భారీ వసూళ్లు సాధించేవి. మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చేలా ఆమె స్టైల్, డాన్స్, గ్లామర్ హైలైట్ అయ్యేవి. అయితే గ్లామర్ పాత్రలతో మాత్రమే ఆమెను గుర్తించడం సరైనది కాదు. ఎందుకంటే నటనపరంగా కూడా ఆమె మంచి టాలెంట్ ఉన్న నటి. అయితే అప్పటి ట్రెండ్ ప్రకారం ఎక్కువగా బోల్డ్ రోల్స్‌నే చేయాల్సి వచ్చింది.
సినిమాల్లో ఎంత వెలుగొందినా, నిజ జీవితంలో మాత్రం ఆమె ఒంటరైంది. ప్రేమించిన వ్యక్తుల దగ్గరే మోసపోయిన ఆమె, మానసికంగా కుంగిపోయారు. కెరీర్‌లో ఉన్నపళంగా అవకాశాలు తగ్గిపోవడం, వ్యక్తిగత జీవితంలో ఒంటరితనం ఆమెను మానసికంగా చాలా బాధించాయి.
సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ చర్చనీయాంశమే. 1996లో హఠాత్తుగా తన నివాసంలో ఆమె మరణించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది. అయితే మరణానికి ముందు ఆమె కన్నడ హీరో రవిచంద్రన్‌కు కాల్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఆ కాల్‌ను అతను లిఫ్ట్ చేయలేకపోయారంట. ఈ విషయాన్ని ఆ స్టార్ హీరోనే తెలియచేయడం గమనర్హం. ఆ రోజున ఫోన్ తీసి మాట్లాడి ఉంటే, ఆమెను కాపాడగలిగేవాడినని రవిచంద్రన్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలియజేశారు.
ఆమె మరణం స్వయంహత్య అంటూ చెప్పినా, అనేక అనుమానాస్పద విషయాలు వెలుగుచూశాయి. కొందరు ఆమెను ఆర్థికంగా మోసం చేశారని, మరికొందరు వ్యక్తిగత జీవితం సమస్యల్లోకి నెట్టివేసిందని చెబుతారు. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో కూడా ఆమె మోసపోయినట్టుగా సూచనలు ఉన్నాయన్న ఊహాగానాలు ఉన్నాయి.