Bollywood celebrity couple: తనకంటే 8 ఏళ్ళు చిన్నవాడితో తల్లైన బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే..?

Bollywood actress husband younger: ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ.. వయసులో తనకంటే ఎనిమిది సంవత్సరాల చిన్న వాడిని వివాహం చేసుకొని, ఐవిఎఫ్ ద్వారా ముగ్గురు పిల్లలకు తల్లి అయింది. ఇంతకు ఈమె ఎవరు.. పెళ్లి చేసుకుంది ఎవరిని.. ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు ఒకసారి చూద్దాం..

1 /5

ప్రేమకు కుల, మత, జాతి, వర్గ, వర్ణ భేదాలు లేవని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. ఇక ఇప్పుడు వయసుతో కూడా సంబంధం లేదని సినీ సెలబ్రిటీలు నిరూపిస్తున్నార ఈ క్రమంలోనే ఒక ప్రముఖ బాలీవుడ్ నటి వయసులో తనకంటే ఎనిమిది సంవత్సరాల చిన్నవాడిని వివాహం చేసుకొని,  43 ఏళ్ల వయసులో తల్లి అయి అందరిని ఆశ్చర్యపరుస్తోంది.  మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. 

2 /5

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకున్న ఫరా ఖాన్. 40 ఏళ్ల వయసులో తనకంటే ఎనిమిది సంవత్సరాలు చిన్నవాడిని వివాహం చేసుకుంది.  ఇక 43 ఏళ్ల వయసులో తల్లి అయిన ఫరాఖాన్ ను చాలామంది ట్రోల్ కూడా చేశారు. ఇక దీనిపై ఆమె మాట్లాడుతూ.. విజయవంతమైన దర్శకురాలిగా,  కొరియోగ్రాఫర్ గా పేరు దక్కించుకున్న నన్ను అవమానించడానికి పెద్ద ప్రయత్నం చేశారు. నేను ఒక స్త్రీని. అందుకే వారు నన్ను ట్రోల్ చేయడానికి కారణం అయ్యింది అంటూ తెలిపింది.   

3 /5

ఈమె మాట్లాడుతూ.. ఈరోజు నా కెరియర్ లో నేను ఎన్నో విజయాలు చూసాను. సమాజం ఏం చెబుతుందో అని ఆలోచించకుండా ముందుకు వచ్చాను. అందుకే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నా.. నన్ను విమర్శించిన వారిని నేనేరోజూ పట్టించుకోలేదు అంటూ ఫరాఖాన్ తెలిపింది. 

4 /5

ఇకపోతే 40 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న ఈమె,  పెళ్లి అయిన మూడు సంవత్సరాల తర్వాత ఐ వి ఎఫ్ ద్వారా ఏకంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇక ఈమె భర్త శిరీష్ కుందర్ , ఈమెకు ఎనిమిది సంవత్సరాల వయసు తేడా ఉంది. తమ సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది ఫరాఖాన్. ఇక ముగ్గురు పిల్లలు జన్మించగా,  వారి పేర్లు దివ్య,  అన్య,  జార్.

5 /5

మొత్తానికి అయితే జీవితం సంతోషంగా ఉండాలి అంటే వయసుతో సంబంధం లేదని అర్థం చేసుకునే మనసు ఉండాలని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.