Cardamom: చర్మం, జుట్టుకు యాలకులు చేసే అద్భుతం ఇదే.. నమ్మలేని ప్రయోజనాలు..

Cardamom Beauty Benefits: యాలకులు వంటలకు మంచి రుచిని అందించడం మాత్రమే కాదు.. ఇందులో అనేక బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీని సువాసన కూడా అద్భుతంగా ఉంటుంది. యాలకుల వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి. యాలకులతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. 
 

1 /5

యాలకుల్లో ఖనిజాలు, విటమిన్ సి, ఐరన్ ఉంటుంది. ఇది జుట్టుకు పోషణ అందిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. మన హెయిర్ కేర్ రొటీన్‌లో యాలకులు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది .  

2 /5

 యాలకులు జీర్ణ సమస్యలకు చెక్ పెడతాయి. ఇందులో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెడతాయి. అంతేకాదు యాలకులు నమలడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యకు మంచి రెమెడీ.  

3 /5

 యాలకులు డైట్లో చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ మెరిసేలా చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ముఖంపై యాక్నే రాకుండా నివారిస్తుంది.  

4 /5

 యాలకులు మన నోటి నుంచి వచ్చే దుర్వాసనకు చెక్ పెడతాయి. వీటిని అమలవడం వల్ల మంచి అరోమా గుణాలు నోటిలో చేరతాయి. దుర్వాసనను నివారిస్తుంది. ఈ యాలకులతో నోరు ఫ్రెష్ గా అనిపిస్తుంది   

5 /5

 స్ట్రెస్ ఎక్కువగా ఉండే వారు యాలకులు తీసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది. యాంగ్జైటీ నుంచి కూడా దూరంగా ఉంటారు. యాలకులతో తయారు చేసిన నూనెలో కూడా అరోమా థెరపీ చేస్తారు.. దీంతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల కూడా మంచి రిలాక్సేషన్ అందుతుంది.