Central on Pan Card: మనం ఏ లావాదేవీలు చేయాలన్నా ప్యాన్ కార్డు తప్పనిసరి. మన భారత్‌లో ప్రతి ఒక్క పౌరుడి వద్ద ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు తప్పనిసరి. అందుకే ఆ మధ్య ఈ రెండిటినీ కూడా లింక్ చేయించారు. అయితే, నిన్న సోమవారం కేంద్రం ప్యాన్ కార్డుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ప్యాన్ కార్డు విధానంపై ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో నకలీ ప్యాన కార్డులో మోసాలకు పాల్పడే అవకాశం లేకుండా పోతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్యాన్ కార్డు ఒకటి. ఇక పై క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త ప్యాన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు.
కేంద్ర ప్రభుత్వం ప్యాన్ కార్డు 2.0 తో కొత్తగా డిజిటల్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి రూ.1435 కోట్లు కేటాయించినట్లు చెప్పింది. ఈ క్యూఆర్ కోడ్ కలిగిన కార్డులను కేవలం ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనుంది.
ఇలా కొత్తప్యాన్ కార్డులపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటే ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక లావాదేవీలు సులభతరం అవుతాయి. అంతేకాదు పనులు కూడా వేగవంతం అవుతాయి. దీని వల్ల ఆర్థిక భద్రత కూడా మెరుగవుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ప్రస్తుత ప్యాన్ కార్డు వినియోగదారులు ఏ దరఖాస్తులు చేయాల్సిన పనిలేదు. వారి కార్డు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అయిపోతుంది. ముఖ్యంగా పన్నుల ఎగవేతకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.