Rashmika Mandanna: తగ్గెదేలా.. ఛావా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Chhaava movie release: చావా మూవీ విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిఉన్నాయి.  ఈ క్రమంలో రష్మిక మందన్న, విక్కికౌశాల్ లు నటించిన హిస్టారికల్ మూవీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

1 /6

పుష్ప2 సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు రష్మిక మందన్న. ప్రస్తుతం  నేషనల్ క్రష్ నటించిన హిస్టారికల్ మూవీ ఛావా రేపు ఫిబ్రవరి 14న విడుదల కానుంది. మరాఠా సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవితం గురించి ఈ సినిమాలో ఉంది.  

2 /6

ఈ సినిమా శివాజీ పంత్ అనే మరాఠి నవల ఆధారంగా తెరమీదకు వచ్చింది. అయితే..ఈ మూవీలో శంభాజీ పాత్రలో.. విక్కి కౌశాల్, యేసుబాద్ పాత్రలో రష్మిక మందన్న నటించారు. ఈ మూవీలోని పాత్ర కోసం రష్మిక మందన్న చాలా కష్టపడ్డారని విక్కికౌశాల్ ఇటీవల నటిపై ప్రశంసలు కురిపించారు.

3 /6

ఈ మూవీకి ట్రైలర్ కు అభిమానుల్లో ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. దీనిలో రష్మిక , విక్కి కౌశాల్ లుక్ అదిరి పోయాయని అభిమానులు  అంటున్నారు. అంతే కాకుండా.. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉందని అభిమానులు అంటున్నారు.   

4 /6

ఛావాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఏ ఆర్ రెహ్మన్ సంగీతం అందించారు.  దీనిలో  ఔరంగా జేబ్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు.  ఈ మూవీ రేపు దేశ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేషనల్ క్రష్ ఈ సినిమా కోసం మరాఠి లో మాట్లాడేందుకు క్లాసులు కూడా తీసుకుందంట.   

5 /6

అచ్చం శంభాజీ సతీమణి యేసుబాయ్ లా కాస్ట్యూమ్ లు ధరించింది. తన కాలు ఫ్యాక్చర్ అయిన కూడా ఛావా సినిమాకోసం అనేక ప్రమోషన్ లలో అలానే పాల్గొంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పట్ల రష్మికకు ఉన్న డెడికేషన్ ఏంటో అర్థంమవుతుందని నెటిజన్లు రష్మికను ప్రశంసిస్తున్నారు.  

6 /6

ఈ  మూవీ కోసం రష్మిక మందన్న రూ. 5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా విక్కి కౌశాల్ రూ. 12 కోట్లు, మొఘల్ షహెన్‌షా ఔరంగజేబు పాత్రలో సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నారూ. 4 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. దీనిలో ఎంత నిజముందో కానీ ప్రస్తుతం రష్మిక మందన్న రెమ్యునరేష్ అంశం వార్తలలో నిలిచింది.