Urvashi Rautela: ఇది కదా మెగాస్టార్ రేంజ్.. బాలయ్య భామకు సాయం చేసిన చిరు.. మ్యాటర్ ఏంటంటే..?

Uravashi rautela prises Chiranjeevi: డాకు మహారాజ్ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఆయన మాకు దైవంతో సమానం అంటూ కూడా చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
 

1 /5

హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా ఇటీవల ఎక్కువగా ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటున్నారు. గతంలో డాకు మహారాజ్ మూవీ విడుదలయ్యాక.. బాలయ్యతో దబిడి దిబిడీ డ్యాన్స్ అంశం వివాదాస్పదంగా మారింది. వీరిద్దరి స్టెప్పులపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు.  

2 /5

అయితే.. హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా మాత్రం.. తనకు బాలయ్య సరసన నటించే అవకాశం రావడం తన లక్ అని చెప్పుకొచ్చారు. కొందరు లేనీ పోనీ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని అవన్ని పట్టించుకొవాల్సిన అవసరం లేదని కూడా నటి స్పష్టం చేశారు.

3 /5

ఈక్రమంలో ప్రస్తుతం  హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా ఒక షాకింగ్ నిజం రివీల్ చేశారు.  చిరంజీవి తమకు దైవంతో సమానంమని అన్నారు. కేవలం ఒక మాట సాయం కోరినందుకు ఆయన  దగ్గరుండీ చేసిన సాయం తమ జీవితంలో మర్చిపోలేమన్నారు.  ఇటీవల ఊర్వశీ తల్లి మీను రౌతెల ఆస్పత్రి పాలైంది.

4 /5

 ఆమె ఎడమ కాలిలో ఎముకలో ఇంట్రా ఆర్టిక్యూలర్‌ ఫ్రాక్చర్‌ అయింది. ఈ క్రమంలో వైద్యులు ఇది డెంజర్ అని చెప్పారు. దీంతో టెన్షన్ కు గురైన ఊర్వశి రౌతేలామెగాస్టార్ సాయం కోరింది. దీనికి ఆయన వెంటనే స్పందించి.. ఆగమేఘాల మీద కోల్‌కత్తా అపోలో ఆస్పత్రి బృందంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చేశారు. డాక్టర్లు సర్జరీ చేయడంతో ఆమె ఆ సమస్య నుంచి బైటపడ్డారు. ఈ విషయమై తాజాగా నటి ఎమోషన్ కామెంట్స్ చేశారు.

5 /5

తమ కుటుంబంఎప్పటికి కూడా చిరంజీవికి రుణపడి ఉంటామని చెబుతు ఎమోషనల్ అయ్యింది. 'వాల్తేరు వీరయ్య’ సాంగ్‌ షూటింగ్‌లో నేను ఆయన్ను దగ్గరగా చూశానని.. తన తల్లికి ఇలాంటి ఆపద కల్గినప్పుడు ఎక్కడ పరిష్కారం దొరకలేదని.. ఆ తర్వాత చిరంజీవిగారు గుర్తొచ్చి సాయం అడగ్గానే అండగా నిలిచారని నటి తన తల్లికి చిరు చేసిన సాయంను రివీల్ చేసింది. దీంతో అభిమానులు మరోసారి చిరు గొప్ప మనసును కొనియాడుతున్నారు.