Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

Dark Circles: కంటి కింద నల్లటి వలయాలు ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. నిద్రలేకపోవడం, ఒత్తిడి, హార్మోన్లలో తేడా, జీవనశైలి ఇలా కారణాలు చాలానే ఉంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి,. కంటి కింద నల్లటి వలయాల నుంచి ఎలా విముక్తి పొందాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
 

Dark Circles: కంటి కింద నల్లని వలయాలను నిర్లక్ష్యం చేస్తే ముఖం అందమంతా దెబ్బతింటుంది. చర్మం రంగు మారిపోతుంది. ముఖమంతా ఆ మచ్చలు వ్యాపిస్తే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్యకు మార్కెట్‌లో లభించే క్రీముల కంటే హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి.

1 /5

టొమాటో థెరపీ కంటి కింద నల్లటి వలయాలను దూరం చేసేందుకు టొమాటో అద్భుతంగా పనిచేస్తుందంటారు. టొమాటో జ్యూస్‌ను లేదా టొమాటో స్లైసెస్‌ను కంటిపై 10 నిమిషాలు ఉంచాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

2 /5

బంగాళదుంప థెరపీ పచ్చి బంగాళదుంప జ్యూస్‌ను ఓ కాటన్ వస్త్రంలో చుట్టి కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలపై ఉంచుకోవాలి. ఓ 10-15 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా రోజూ చేస్తే డార్క్ సర్కిల్స్ సమస్య పోతుంది. 

3 /5

ఆరెంజ్ జ్యూస్ థెరపీ ఆరెంజ్ జ్యూస్ థెరపీ కంటి కింద నల్లటి వలయాల సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆరెంజ్ స్లైసెస్ ప్రతిరోజూ కంటి కింద ఉంచుకుంటే చాలు. 

4 /5

కోల్డ్ టీ బ్యాగ్ థెరపీ కంటి కింద నల్లటి వలయాల్ని పోగొట్టాలంటే కోల్డ్ టీ బ్యాగ్స్ థెరపీ మంచి ఫలితాలనిస్తుంది. టీ బ్యాగ్స్‌ను నీళ్లలో తడిపి కాస్సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. పూర్తిగా ఛిల్డ్ అయిన తరువాత కంటిని కవర్ చేస్తూ ఉంచుకోవాలి. నిర్ణీత సమయంలో ప్రతి రోజూ చేయాలి

5 /5

కోల్డ్ మిల్క్ థెరపీ కంటి కింద నల్లటి వలయాల సమస్యను చల్లని పాలతో కూడా తొలగించవచ్చు. ఈ విదానం కంటికి, చర్మానికి కూడా మంచిది. చల్లని పాలను దూది సహాయంతో కంటి కింద నల్లటి వలయాలపై ఉంచడం చేయాలి. ఇలా 20 సార్లు చేయాలి. ప్రతిరోజూ చేస్తే మంచి ఫలితాలుంటాయి.