Shriya: జగన్ ఆస్తుల గొడవల వేళ.. అమ్మాయిలకి సమాన వాటా ఉండి తీరాలన్న హీరోయిన్ శ్రియ

Shriya Saran vs Jagan: హీరోయిన్ శ్రియ రాజకీయాలకి వీలైనంత దూరంగానే ఉంటూ వచ్చింది. కానీ తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా ఉంది అని.. ఆమె కావాలనే జగన్ మీద ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తోంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

1 /5

ఒకప్పడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచున్న శ్రియ శరణ్ తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఎపుడు సినిమాలతో మాత్రమే బిజీగా ఉండే శ్రియ రాజకీయాలకి ఆమడ దూరంలో ఉంటుంది. రాజకీయాలకి, రాజకీయ నాయకుల మీద విమర్శలకు శ్రియ ఎప్పుడూ దిగలేదు. కానీ తాజాగా శ్రియ తన రూటు మార్చింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.   

2 /5

తాజాగా శ్రియ పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైఎస్ జగన్ మీద పంచ్ లాగా ఉంది అని టాక్ నడుస్తోంది. చాలా కాలం క్రితం శ్రియ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మధ్య ప్రేమ వ్యవహారం ఉంది అని పుకార్లు వచ్చాయి. అవి పెద్దగా ఊపందుకోలేదు కానీ… వాళ్ళిద్దరూ బ్రేక్ అప్ చెప్పుకుని విడిపోయారుని ఒక పుకారు అయితే ఇండస్ట్రీలో ఒకప్పడు బాగా వినిపించింది.

3 /5

ఒకవైపు వైఎస్ జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తి తగాదాల గురించి తెలియని వారు ఉండరు. వైఎస్ కుటుంబాన్ని ఈ ఆస్తి పంపకాలు హాట్ టాపిక్ గా మార్చేశాయి. తన వాటా తనకు ఇవ్వడం లేదు అని షర్మిల కంప్లైంట్ లు ఇస్తున్న సమయంలో శ్రియ తన ఇన్స్టాగ్రామ్ లో ఆడపిల్లలకి కూడా.. ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అన్నట్టు పోస్ట్ చేశారు. 

4 /5

మామ్స్ మ్యాజిక్ బ్రాండ్ వారికోసం చేసిన యాడ్ లో భాగంగా శ్రియ.. భారతదేశం మొత్తం మీద కేవలం 7 శాతం ఆడవాళ్ళు మాత్రమే సమానంగా ఆస్తి అందుకుంటున్నారు అని.. కానీ అమ్మాయిలకి కూడా ఆస్తిలో సమాన హక్కులు ఉండాలి అంటూ ఈ యాడ్ సారాంశం. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

5 /5

అయితే జగన్, షర్మిల మధ్య జరుగుతున్న పోరు లో శ్రియ.. షర్మిల కి మద్దతు ఇస్తూ ఇండైరెక్ట్ గా జగన్ కి ఈ మాటలు చెబుతుందా అని కొంతమంది నేటిజన్స్ కామెంట్ లో కొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రియ ఉద్దేశం ఏమైనా కూడా.. ఆమె చేసిన పోస్ట్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు బాగా సెట్ అవ్వడంతో నెటిజన్లు బ్రేక్ అప్ కారణంగా.. జగన్ మీద ఉండిపోయిన కోపంతో శ్రియ ఇలా చేస్తుందని కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు.