How To Find Right Perfume: పెర్ఫ్యూమ్ కొనుగోలు చేయడానికి అనేక ఎంపికలు ఉన్నాయి.అయితే సరసమైన ఎంపికల కోసం ఈ టిప్స్ మీకు ఎంతో ఉపయోగపడుతాయి..
How To Find Right Perfume: ఎండాకాలంలో చెమట వల్ల వాసన రాకుండా ఉండటానికి డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతుంటారు. పెర్ఫ్యూమ్ షాపింగ్ చేసేటప్పుడు వాసనపైనే కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం.
పెర్ఫ్యూమ్ కొనుగోలు చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసం..
ఎండాకాలంలో డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే, వేడి వాతావరణంలో చెమట ఎక్కువగా పడుతుంది.
డియోడరెంట్ చెమట వాసనను నివారిస్తుంది. పెర్ఫ్యూమ్ శరీరానికి సువాసనను అందిస్తుంది.
పెర్ఫ్యూమ్‌ను మనం ఎలా ఉపయోగిస్తామో చాలా ముఖ్యం. డైరెక్ట్ గా శరీరానికి కూడా స్ప్రే చేస్తారు. ఇది చర్మంపై దుష్ప్రభావాలకు దారితీస్తుంది.
ముఖ్యంగా శరీర అంతర్గత భాగాలకు స్ప్రే చేయకూడదు ఎందుకంటే ఇది అలెర్జీకి దారితీస్తుంది.
పెర్ఫ్యూమ్ ఎంత అందంగా వాసన వచ్చినా, అది మీ చర్మానికి సరిపోతుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
చర్మంపై దురద లేదా నల్ల మచ్చలు రాకుండా ఉండేలా చూసుకోవడానికి ఈ టిప్స్ సహాయపడుతాయి.
పెర్ఫ్యూమ్ కొనడానికి ముందు షాప్ లోపలే దాని సువాసనను చెక్ చేయడం చాలా ముఖ్యం.
ఎందుకంటే స్టోర్ లోపల ఎయిర్ కండిషనింగ్ పెర్ఫ్యూమ్ వాసనను ప్రభావితం చేస్తుంది.
వేసవిలో తేలికపాటి సువాసన కలిగిన పరిమళ ద్రవ్యాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.