Abhishek Sharma Love Story: అభిషేక్ శర్మ ప్రియురాలిని చూశారా.. హీరోయిన్లను మించిన అందం..!

Abhishek Sharma Girlfriend: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుఫున దుమ్ములేపి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ముఖ్యంగా ఈ సీజన్‌లో తన దూకుడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. అదేజోరులో టీ20 టీమ్‌కు ఎంపికై.. తన పర్ఫామెన్స్‌తో అలరించాడు. నేడు (సెప్టెంబర్ 4)న బర్త్ జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ గర్ల్ ఫ్రెండ్ ఎవరు..? ఆమె ఏం చేస్తుంటారు..? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
 

1 /8

ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ దుమ్ములేపే పర్ఫామెన్స్‌తో బౌలర్లకు దడ పుట్టించాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఎస్ఆర్‌హెచ్‌కు రికార్డుస్థాయిలో స్కోర్లు అందించారు.

2 /8

మాజీ మిస్ రాజస్థాన్ రన్నరప్ దియా మెహతా అభిషేక్ శర్మ గర్ల్‌ఫ్రెండ్‌ అంటూ ఇటీవల రూమర్లు పుట్టుకొచ్చాయి. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.   

3 /8

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫోటోషూట్ సమయంలో అభిషేక్ శర్మ, దియా కలిసి కనిపించడంతో ఈ పుకార్లు మరింత జోరుగా వ్యాపించాయి. వారి రిలేషన్‌షిప్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.    

4 /8

మోడల్,  ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా దియా మెహతా ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది. అయితే అభిషేక్ శర్మతో ప్రేమ వ్యవహారంతో క్రికెట్ అభిమానుల దృష్టిలో పడింది.  

5 /8

అభిషేక్ శర్మ తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పలేదు. దియా మెహతాతో రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా మెయింటెన్ చేస్తున్నట్లు తెలిసింది.  

6 /8

తన గురించి ఎన్ని రూమర్లు వస్తున్నా.. వాటిని అభిషేక్ శర్మ పక్కనబెట్టి కెరీర్‌ మీద ఎక్కువగా ఫోకస్‌ పెట్టాడు.  

7 /8

టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు వీడ్కోలు పలకడంతో అభిషేక్ శర్మ ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు.  

8 /8

దియా మెహతాతో సంబంధం గురించి అభిషేక్ శర్మ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై మౌనం వహిస్తున్నారు. పుకార్లు నిజమైతే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.