Palapitta-Jammi Tree: దసరా రోజున ప్రజలంతా తప్పకుండా పాలపిట్టను, జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అనుకొని విధంగా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు.
దేశంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబరు 3 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 12 వరకు కొనసాగనున్నాయి. రేపు అంటే.. అక్టోబర్ 12న విజయ దశమిని ఎంతో వేడుకగా జరుపుకుంటాం.
అయితే.. దుర్గమ్మ వారు తొమ్మిది రోజుల్లో కూడా.. తొమ్మిది అవతారాలలో భక్తులకు కొంగు బంగారంగా అనుగ్రహిస్తుంటారు. అయితే.. దసరా నేపథ్యంలో..అనాదీగా పాలపిట్టను చూడాలని, జమ్మిచెట్టును తప్పకుండా దర్శించుకొవాలని చెబుతుంటారు.
పాలపిట్ట మంచి శకునం అని పండితులు చెబుతుంటారు. దసరా రోజు పాలపిట్టను చూసిన వారికి జీవితంలో తిరుగే ఉండదని చెబుతుంటారు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దసరా రోజున శమీ చెట్టు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తుంటారు.
ఇలా పూజిస్తే.. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవని, దుర్గమ్మ అనుగ్రహాంతో జీవతంలో అన్ని సమస్యల నుంచి బైటపడుతారని పండితులు చెబుతుంటారు. అందుకు జమ్మిచెట్టును పూజించాలంటారు
జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి కుంకుమ, పసుపు, పూల మాలలతో అలంకరణ చేయాలి. ఆ తర్వాత ధూపం, దీపం నైవేద్యాలను సమర్పించాలి. ఆ తర్వాత మనకు తోచిన నైవేద్యంను సమర్పించుకొవాలి.
జమ్మి చెట్టును పూజించిన తర్వాత కొన్ని ఆకుల్ని మన ఇంటికి తెచ్చుకొవాలి. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. దసరా రోజున పెద్దల ఆశీర్వాదం తీసుకొవాలి. ఈరోజున ఏ కార్యమైన స్టార్ట్ చేస్తే అది నిర్విఘ్నంగా పూర్తవుతుందని పండితులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)