Encephalitis Virus: దేశంలో మరో కొత్త వైరస్ ఎంట్రీ ఇచ్చింది.. జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Encephalitis Virus: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే అందరూ కోరుకుంటున్నారు. అన్ని దేశాలు తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను శాశ్వతంగా తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే తరుణంలో మరో కొత్త రకమైన వైరస్ పుట్టుకు వచ్చింది.. దాని పేరే జపనీస్ ఎన్సెఫాలిటిస్.. ఇది ముందుగా శరీరంలోకి సోకి జ్వరంకు వచ్చే లక్షణాలను కలిగి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్నదిగా శరీరాన్ని మొత్తాన్ని దెబ్బతీసే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
జపనీస్ ఎన్సెఫాలిటిస్ జ్వరం కేసు ప్రస్తుతం భారత్ లో కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే ఇది గతంలో సోకిన జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలుస్తోంది. ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరో మంచికి కూడా వ్యాపిస్తుందట.
ఈ జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ అనేది అచ్చం దోమల ద్వారా వచ్చే జ్వరంలా ఉంటుందని డాక్టర్ జుగల్ కిషోర్ తెలిపారు. అయితే దోమకాటు కారణంగా వచ్చే మలేరియా డెంగ్యూ అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. కానీ ఈ వైరస్ మాత్రం సులభంగా సంక్రమిస్తుందిట.
జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం ఇచ్చే సమయంలో వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య చాలా తక్కువ అయినప్పటికీ.. రోజులకొద్దీ పెరుగుతూ వస్తోంది.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్సెఫాలిటిస్ వ్యాధి సోకిన వారు ప్రారంభంలో కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు. ఈ వైరస్ సోకిన వారు ముందుగా జ్వరం బారిన పడుతూ ఉంటారు. ఇది పిల్లల్లో సోకితే వారికి చాలా తక్కువ మోతాదురు జ్వరం నమోదవుతుంది. కొన్ని రోజుల తర్వాత వాంతులు విరేచనాలు కూడా అవుతాయి.
ఈ వైరస్ సోకిన వారిలో వాంతులు విరేచనాలు అయిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనిషి మెదడు కణాలు దెబ్బతిని రోగి ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశాలున్నాయి. ఆ తర్వాత మరికొన్ని రోజుల్లోనే ఆ పేషెంట్ మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ వైరస్ సోకకుండా ఉండడానికి దోమల నుంచి మీకు మీరే రక్షించుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చేతులను ఏదైనా ఆహారాలను తినే క్రమంలో శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది. దీంతోపాటు ఏదైనా జ్వరం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడితే వైద్యులను తప్పకుండా సంప్రదించండి.