Mutual Fund SIP: పడిపోతున్న మార్కెట్‌లో SIP కొనసాగించాలా ? లేక డబ్బు విత్‌డ్రా చేయాలా ?

Mutual Fund SIP: స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు సిప్ లను ఆపాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మరి నిపుణుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. 

1 /7

Mutual Fund SIP: సిప్ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ఇప్పుడు దాదాపు అందరికీ తెలిసిందే. సిప్ ద్వారా ఒక ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ స్కీములో నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే సౌకర్యాన్ని పొందుతాడు. వీరు నెలకు రూ. 500 నుంచి దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో స్థిరమైన పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సేకరించవచ్చు. అయితే గత నాలుగు నెలలుగా స్టాక్ మార్కెట్ నిరంతరం ఒడిదుడుకులకు లోనవుతుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలా మానేయాలా అని ఆలోచిస్తున్నారు. మరి ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.   

2 /7

స్టాక్ మార్కెట్ క్షీణించినప్పుడు పెట్టుబడిని పెంచుకునే ఛాన్స్ ఉంటుందని  నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పడిపోయినప్పుడు మంచి ఫండ్ లో సిప్ ప్రారంభించడంలో ఎలాంటి హాని ఉండదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెరిగిన వెంటనే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందిస్తుంది. షేరు ధర తక్కువ ఉన్నప్పుడు కస్టమర్లు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వారికి ఎక్కువ యూనిట్లు లభిస్తుంటాయి. ఆ విధంగా మీరు ఎక్కువ డబ్బును పొందవచ్చు.   

3 /7

ఒక వ్యక్తి ప్రతినెలా రూ. 1000 మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే..ఆ వ్యక్తి పెట్టుబడి పెడుతున్న ఫండ్ లోని ఒక యూనిట్ ధర ప్రస్తుతం 20 రూపాయలకు పడిపోయినట్లయితే అప్పుడు 1000 రూపాయలు దాదాపు 50 యూనిట్లను కొనుగోలు చేస్తాయి. మార్కెట్ పుంజుకుని ఉంటే అదే సంఖ్యలో యూనిట్లు రావడానికి కొంత సమయం పడుతుంది. 

4 /7

అయితే కోవిడ్ సమయంలో స్టాక్ మార్కెట్ 40శాతం పడిపోయింది. చాలా మంది భయంతో తమ సిప్ లను ఆపేశారు. చాలా మంది ప్రజలు రిటైల్ ధరలకు నిధులను అమ్మేశారు. ఎందుకంటే మార్కెట్ మరింత పడిపోతే ఏమీ జరుగుతుందో అని భయపడ్డారు. అదే సమయంలో కొందరు ఇన్వెస్టర్లు పట్టుదలతో ఉన్నారు. ఫలితంగా వారి పెట్టుబడులు భారీగా పెరిగాయి. మంచి లాభాలను ఆర్జించారు.   

5 /7

మ్యూయువల్ ఫండ్స్ పడిపోతే స్వల్పకాలంలో నష్టాలు వస్తాయి. కానీ అది దీర్ఘకాలంలో ఎప్పుడూ ఎలాంటి హాని కలిగించదు. సుదీర్ఘకాలం అంటే కనీసం ఏడు ఏళ్లు అని భావించాలి. స్టాక్ మార్కెట్ కొంతకాలం క్షీణించినప్పటికీ మార్కెట్ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తుంది.కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బును ఎప్పుడూ తీసుకోకూడదు.   

6 /7

ఒక వేళ మీరు డబ్బులు పోతాయని భయపడుతున్నట్లయితే సిప్ ని పాజ్ చేసుకోవచ్చు. దీని అర్థం సిప్ ను ఒకటి నుంచి 6 నెలల వరకు నిలిపివేయవచ్చు. ఆ సమయం ముగిసిన తర్వాత మళ్లీ కొంత పడటం ప్రారంభం అవుతుంది. అయితే ఇది దీర్ఘకాలంలో నష్టాలకు దారి తీయవచ్చు. 

7 /7

సిప్ ప్రారంభించేటప్పుడు నిధులను ఎంచుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆర్ధిక సలహాదారుడి సహాయం తప్పకుండా తీసుకోవాలి. దాంతో పోర్ట్ పోలియో నష్టాలను తగ్గిస్తుంది. డెట్ ఫండ్స్, లార్జ్ క్యాప్స్ ఫండ్స్ పోర్ట్ పోలియోలో ఎంచుకోవాలి. ఎందుకంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్ లలో అమ్మకాల ఒత్తిడి కూడా ఫండ్ ను ప్రభావితం చేస్తుంది. ఇది మరింత నష్టాన్ని కూడా కలిగిస్తుంది. అయితే లక్ష్యం 10ఏళ్లు అయితే ఎలాంటి రాజీ లేకుండా సిప్ ను కొనసాగించవచ్చు.