Gold Rate Today: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. బంగారం ధర ఏకంగా 86వేలు దాటేసింది. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. ప్రధానంగా బంగారం ధర హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు స్థాయిని తాకడంతో బంగారం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రూపాయి విలువకూడా పతనమైంది.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి ఆల్ టైం రికార్డు స్థాయి దిశగా బంగారం ధరలు అడుగులు వేస్తున్నాయి. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86,240 పలుకుతుండగా...22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77, 650 పలుకుతోంది. అదే సమయంలో కేజీ బంగారం ధర రూ. 96,699 పలుకుతోంది. బంగారం ధర చరిత్రలోనే తొలిసారిగా 86వేల రూపాయలు దాటింది.
బంగారం ధరలు పెరగడానికి ముఖ్యంగా డాలర్ విలువ భారీగా పెరగడం కూడా కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 87.11 రూపాయలకు పతనం అయ్యింది. ఇది చరిత్రలోనే అత్యంత కనిష్టమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల కారణంగానే ప్రస్తుతం అమెరికా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
ఇదెలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మెక్సికో, కెనడాపైన ప్రకటించిన ఆంక్షల కొరడాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ మెక్సీకో, కెనడా పట్ల కఠనంగానే వ్యవహారిస్తామని తెలిపారు. ఇక దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
అతిత్వరలోనే బంగారం 90వేల స్థాయికి చేరే అవకాశం ఉందని కనిపిస్తోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలు తయారు చేయించుకోవాలంటే స్థానిక జీఎస్టీ పనులు కలుపుకుని ఆభరణం ధర భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఈ ట్రెండ్ ఇబ్బందికరంగా ఉందని చెప్పవచ్చు. అయితే అటు అమెరికాలో కూడా బంగారం ఏకంగా ఒక ఔన్సు 2850 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణమని చెప్పవచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగినట్లయితే పసిడి ధర త్వరలోనే లక్ష రూపాయలు తాకడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.