Hair Care Tips: రోజూ ఈ నట్స్ సేవిస్తే చాలు..అందమైన, పొడవైన కేశాలు మీ సొంతం

Hair Care Tips: సీజన్ మారిన ప్రతిసారీ ఆరోగ్యంతో పాటు కేశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే కేశాలకు సంబంధించిన పలు సమస్యలు వెంటాడుతాయి. ఇందులో ప్రధానంగా జుట్టు రాలడం, నిగారింపు కోల్పోవడం, కేశాలు బలంగా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. 

Hair Care Tips: అయితే కేశాలకు సంబంధించిన ఈ సమస్యల పరిష్కారానికి నట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయంటున్నారు బ్యూటీషియన్లు. కేశాలు ఆరోగ్యంగా, అందంగా ఎదిగేందుకు రోజూ డైట్‌లో ఈ ఐదు రకాల నట్స్ ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలుంటాయి.

1 /5

వాల్‌నట్స్ వాల్‌నట్స్ లేదా అఖ్రోట్ అనేది ఆరోగ్యానికి, కేశాలకు చాలా చాలా మంచిది. ఇందులో కూడా విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కేశాలకు తగిన పోషకాలు అందిస్తూ వివిధ సమస్యల్నించి రక్షిస్తాయి. 

2 /5

కిస్మిస్ కేశాల ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ప్రతిరోజూ కిస్మిస్ తినడం మంచి అలవాటు. దీనివల్ల కేశాలు పొడుగ్గా అందంగా ఉంటాయి. నిగనిగలాడుతుంటాయి.

3 /5

ఫ్లక్స్‌సీడ్స్ ఫ్లక్స్‌సీడ్స్ సేవించడం వల్ల అటు కేశాలకు ఇటు ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఇ, సెలేనియం, జింక్ తగిన మొత్తంలో ఉంటాయి. కేశాలకు తగిన పోషకాలు అందిస్తాయి. 

4 /5

జీడిపప్పు జీడిపప్పు రోజూ తగిన పరిమాణంలో తీసుకుంటే శరీరానికి , కేశాలకు కావల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా కేశాలు బలంగా మారతాయి 

5 /5

బాదం కేశాల ఆరోగ్యం కోసం బాదం అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ 7 బాదం పిక్కలను నానబెట్టి ఉదయం లేవగానే తింటే కావల్సినన్ని పోషకాలు అందుతాయి. బాదంలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల కేశాలకు లాభం కలుగుతుంది.