Bad Cholesterol: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు విడుదల చేశారు.

మనిషి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ ఎంత మంచిదో..బ్యాడ్ కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరం. గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులకు దారి తీస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ తరుణంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కొన్ని రకాల ఆహార పదార్ధాల జాబితా విడుదల చేశారు. ఈ ఆహార పదార్ధాలు కొవ్వును కరిగించడమే కాకుండా మీ గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవచ్చంటున్నారు. ఆ ఆహార పదార్ధాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కూరగాయలు అధికంగా తీసుకుంటే వాటిలో ఉండే ఫైబర్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.