Health Benefits Of Beer: ఏదైనా అతిగా తీసుకోవడం అనారోగ్యానికి హాని కలుగుతుంది. అది ఆహారమైనా.. అల్కాహాల్ అయినా.. ఇది బీరుకు కూడా వర్తిస్తుంది. మీకు బీరు తాగే అలవాటు ఉంటే.. పరిమితిలో తాగితే మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పరిమితికి బీర్ తాగే వారి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకోండి.
బీర్ మితంగా తాగితే.. ఎముక బలానికి మంచిది. బీర్‌లో ఉండే సిలికాన్ ఎముకలను బలపరుస్తుంది.
బీర్‌లో ఉండే కరిగే ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి. బీర్‌లో చేదు ఆమ్లాలు ఉంటాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహార విచ్ఛిన్నతను మెరుగుపరుస్తుంది.
రోజూ మితంగా బీరు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు.. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నట్లు తేలింది.
మితమైన బీర్ వినియోగం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధ్య వయస్కులు, వృద్ధులలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
దంతాలలో కావిటీస్, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను బీర్ నాశనం చేస్తుందని నివేదికలు వెల్లిస్తున్నాయి.. (గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం నివేదికలపై ఆధారపడి ఉంటుంది. పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచింది..)