Healthy Fat Foods: కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ కాగా రెండవది హెచ్‌డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్. కానీ చాలామంది ఫ్యాట్ అనగానే చెడు కొలెస్ట్రాల్ అనే భావిస్తుంటారు. కానీ హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అవసరమనే విషయం చాలామందికి తెలియదు.
హెల్తీ ఫ్యాట్స్ అనేవి శరీర నిర్మాణం, ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరానికి అవసరమైన ఎనర్జీ అందిస్తాయి. సెల్స్ నిర్మాణంలో దోహదపడతాయి. హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. హెల్తీ ఫ్యాట్స్ పొందాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం.
అవకాడో ఇది హెల్తీ ఫ్యాట్స్‌కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఇంందులో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంంటాయి. గుండె ఆరోగ్యానికి లాభం కల్గిస్తాయి. అవకాడోలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంచుతాయి.
చియా సీడ్స్ చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. శరీరంలో గుడ్ ప్యాట్స్తో పాటు ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. చియా సీడ్స్‌ను పెరుగు, స్మూదీ, సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఈ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ లెవెల్ మెరుగుపర్చేందుకు , గుండె వ్యాధుల్ని తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో హెల్తీ ఫ్యాట్స్ కావల్సినంతగా ఉంటాయి. ఇందులో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ నాశనం చేసేందుకు స్వెల్లింగ్ సమస్య తగ్గించేందుకు ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యం ఎప్పటికీ మెరుగ్గా ఉంటుంది.
నట్స్ బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్శాచ్యుురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఫ్యాటీ ఫిష్ సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధుల్ని దూరం చేస్తాయి. వారంలో 2-3 సార్లు ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.