Vitamin Deficiency Symptoms: మనకి ఏదన్న ఆరోగ్య సమస్య వచ్చే ముందు మన శరీరం ముందుగా.. కొన్ని సూచనలు పంపిస్తూ ఉంటుంది. అవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మాత్రం.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అలానే మన ఒంట్లో విటమిన్ డెఫిషియన్సీ మొదలైతే.. మనకు ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి.. మరి అది ఏదో ఒకసారి చూద్దాం..
ఏదైనా ఆరోగ్య సమస్య సడన్ గా వస్తుంది అనుకోవడం మాత్రం మన పొరపాటే. ఎందుకంటే మన శరీరంలో ఏదన్నా పొరపాటు ఉంటే.. మన శరీరం మనకు ముందుగానే సూచనలు.. పంపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాంటి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనకి కనిపించే లక్షణాలు ఏమిటో ఒకసారి చూద్దాం
విటమిన్ డెఫిషియన్సీ మన శరీరంలో మొదలైతే మనకు విపరీతమైన ఆకలి వేయడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఆకలిని నియత్రించడంలో ప్రోటీన్..ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన ఆహారంలో ఎప్పుడు అయితే మనం.. తగిన ప్రోటీన్ తినమో.. అప్పుడు మన శరీరం..అధిక క్యాలరీల ఆహారం కోసం ఎక్కువగా తాపత్రయపడుతుంది. దీనివల్ల మనకు ఆకలి పెరిగి.. ఎక్కువగా తినాలనిపిస్తుంది. కాబట్టి ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నట్టే.
శరీరంలో ఎక్కడైనా వాపు కనిపిస్తే కూడా అది ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు. ముఖ్యంగా పాదాలు, కాళ్లు, చేతుల్లో.. ఈ వాపులు కనిపిస్తూ ఉంటాయి. అల్బుమిన్ వంటి ప్రోటీన్లు మీ శరీరంలోని ద్రవాల సమతుల్యతను రక్షించడానికి పనిచేస్తూ ఉంటాయి . అయితే ఈ ప్రోటీన్ లోపం జరిగినప్పుడు.. ఆ ద్రవాలు రక్తనాళాల నుండి బయటకు వెళ్లి కణజాలాల లగా పేరుకుపోయి మనకు వాచినట్లు కనిపిస్తాయి.
మన చర్మం కాంతివంతంగా మెరవాలన్నా, జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్న.. ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపిస్తే.. మన చర్మం అలానే జుట్టు ఆరోగ్యం తగ్గిపోతుంది. కొలాజిన్, కెరాటిన్ వంటి ప్రోటీన్లు ఎప్పుడైతే మన శరీరంలో లోపిస్తాయో.. అప్పుడు చర్మం, జుట్టు అనారోగ్యంగా కనిపిస్తాయి.
అంతేకాదు మనలో గోళ్లు సరిగ్గా పెరగకపోయినా ప్రోతటీన్ లోపం ఉన్నట్టే అర్థం. కాబట్టి విటమిన్ లోపం ఉంటే.. గోళ్లు సరిగ్గా పెడగవు, జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, అలానే చర్మం కూడా పొడిబారినట్లు తయారవుతుంది. కాబట్టి ఈ లక్షణాల్లో.. ఏ లక్షణం మీకున్న ఒకసారి డాక్టర్స్ ని సంప్రదించడం లేదా ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం చేస్తే మంచిది