Banana Leaf: అందుకే అరటి ఆకు అంత గొప్పది.. మీకు తెలియని 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..

Banana Leaf Surprising Benefits: మన పూర్వీకులు అరటి ఆకుల్లోనే భోజనం చేసేవారు ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అరటి ఆకును పూజించే సంస్కృతి కూడా ఉంది అయితే అరటి ఆకులు తినడం అరటి పనులు తీసుకోవడం తరతరాలుగా వస్తుంది రాను రాను ఇందులో మార్పు జరిగి ఆర్టిఫిషియల్ విస్తర్లలో తింటున్నారు.
 

1 /7

అయితే అరటి ఆకుల్లో భోజనం చేయడమే కాదు దీంతో మన శరీరాన్ని కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.అరటి ఆకు చూడడానికి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది మృదువుగా ఉంటుంది దీన్ని పెళ్లిళ్లు ఫంక్షన్ లోనే చూస్తాం అయితే ఈ అరటి ఆకుల్లో మెడిసినల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి .  

2 /7

ఇది న్యాచురల్ గా మనకి నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది ఆకుతో మనకు తెలియని ఐదు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. అరటి ఆకులో డ్రెస్సింగ్ చేయడానికి కూడా ఉపయోగించేవారు. ఇది గాయాలు మానడానికి, బొబ్బలు తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు.   

3 /7

ఎందుకంటే అరటి ఆకులో నాచురల్ గా కూలింగ్ గుణాలు కలిగి ఉంటుంది. కాలిన గాయాలను త్వరగా మానుస్తుంది. మన పూర్వికులు కొబ్బరి నూనెతో పాటు అరటి ఆకుని కలిపి గాయాలపై అప్లై చేసేవారు.  

4 /7

అంతేకాదు అరటి ఆకు వెక్కిళ్లు వచ్చినప్పుడు కూడా త్వరగా తగ్గిపోతాయి. సాధారణంగా వెక్కిళ్లు వచ్చినప్పుడు రకరకాలుగా తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. కానీ అరటి ఆకులో ఈ తేనే కలిపి తీసుకోవటం వల్ల వెక్కిళ్లు తగ్గిపోతాయి అయితే అరటి ఆకును కాల్చి తీసుకుంటారు.అయితే దీనిపై ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు.  

5 /7

కొంతమందికి చర్మం పైన సూర్యుని హానికర కిరణాల వల్ల చర్మంపై ట్యాన్ అవుతుంది. ఎరుపు రంగులోకి మారిపోతుంది 2018 నివేదిక ప్రకారం అరటి ఆకుల్లో ఎక్కువ శాతం లిగనైన్ ఉంటుంది. ఇవి ఎండ వల్ల కణాలు నశించకుండా కాపాడుతుంది.  ముఖ్యంగా అరటి ఆకులో సన్‌స్క్రీన్‌లో ఉపయోగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి.  

6 /7

 నేషనల్ లైబ్రరీ మెడిసిన్ ప్రకారం అరటి ఆకుల్లో కడుపు సంబంధిత వ్యాధులను నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది ముఖ్యంగా డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుంది కాల్చిన బూడిదతో ఆసిడిటీ అజీర్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  

7 /7

అంతేకాదు డయాబెటిస్ తో బాధపడే వారికి అరటి ఆకు ఒక వరం ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు, పుష్కలంగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అరటి ఆకులతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి అయితే వీటిని మానవులపై ఇప్పటి వరకు జంతువులపై నిర్వహించారు కానీ, మానవులపై ఏ అధ్యయనం చేయలేదు.