Honda City Apex Edition Price: ప్రముఖ హోండా కంపెనీ నుంచి మార్కెట్‌లోకి మరో కారు విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Honda City Apex Edition Price: ప్రముఖ జపనీస్ కార్ల తయారీ కంపెనీ హోండా మార్కెట్‌లోకి మరో ఆప్డేట్ వేరియంట్ కారును విడుదల చేసింది. గతంలో విడుదలైన హోండా సిటీ కారు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ కలిగి ఉండడంతో.. మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో మళ్లీ ఈ కారుకు సంబంధించిన సరికొత్త ఎడిషన్ లాంచ్ అయ్యింది. దీనిని హోండా కంపెనీ అపెక్స్ ఎడిషన్ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీ అపెక్స్ ఎడిషన్‌ను ఆప్డేటెడ్ డిజైన్‌తో విడుదలైనట్లు తెలుస్తోంది. అలాగే అధునాత ఫీచర్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది రెండు ( V మరియు VX) వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇవి విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
ఈ హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ కారు అద్భుతమైన ఇంటీరియర్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ప్రత్యేకమైన లేత గోధుమ రంగు ఇంటీరియర్‌తో వస్తోంది. అపెక్స్ బ్రాండింగ్‌తో వచ్చిన స్పెషల్ సీట్స్ కూడా ఉంటాయి. అలాగే అద్భుతమైన కవర్లను కూడా అందిస్తోంది.
ఈ కారులోని ప్రధాన హైలెట్ ఏడు రంగు ఎంపికలతో కూడిన రిథమిక్ యాంబియంట్ లైటింగ్ వస్తోంది. అంతేకాకుండా స్పెషల్ అపెక్స్ బ్రాండింగ్ ఫెండర్‌లు కూడా లభిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ కారులో కంపెనీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందిస్తోంది.
ఇందులోని ఇంజన్ 121 PS పవర్‌తో పాటు 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కారుకు సంబంధించిన రెండు వేరియంట్స్ ఒక లీటర్ ఇంధనానికి 17.8 కి.మీ మైలేజీని అందిస్తోంది. ఇక ఈ కారులో బేస్ వేరియంట్ ధర రూ. 13.3 లక్షల (ఎక్స్-షోరూమ్)తో లభిస్తోంది.
ఇక ఈ కారులో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15.62 లక్షల నుంచి అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్‌తో పాటు ఇతర టాటా కార్లతో పోటీ పడుతోంది. అంతేకాకుండా ఈ కారుకు సంబంధించిన సేల్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి.