Hall Tickets In Whatsapp: విద్యార్థులకు గుడ్‌న్యూస్ ఇక హాల్ టికెట్ల కోసం కంగారుపడాల్సిన పనిలేదు. నేరుగా వాట్సాప్ ద్వారానే ఎగ్జామ్ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది విద్యార్థులకు గుడ్‌న్యూస్. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ముందుగా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, గతంలో ప్రైవేటు విద్యాసంస్థలు సకాలంలో ఫీజు చెల్లించలేని విద్యార్థులకు హాల్ టికట్లు నిలిపివేసేవారు. ఇప్పుడు అలాంటి కష్టాలు విద్యార్థులకు ఉండవు
ఇక పై ఇంటర్ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థులు నిరభ్యంతరంగా ఏ టెన్షన్ లేకుండా పరీక్షలు రాసుకోవచ్చు.
ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు 9552300009 నంబర్ ద్వారా నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పిస్తోంది. ఇలా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం త్వరలో పదవ తరగతికి కూడా కల్పించనున్నారు.
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇది రెండు సెషన్లలో జరుగుతుంది. ఒకేషనల్ ఇంటర్ వారికి 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.
2025 మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్చి 3వ తేదీ సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి.