IND vs WI Test Series: పుజారా స్థానంలో నెం.3లో ఎవరికి ఛాన్స్..? లిస్ట్‌లో ఈ ఐదుగురి పేర్లు

Who can Replace Cheteshwar Pujara at No 3: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విఫలమైన సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారాపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. వెస్టిండీస్ పర్యటనలో మూడోస్థానంలో కొత్త బ్యాట్స్‌మెన్‌ను ఆడించనున్నారు. ఎంతో కీలకమైన నెం.3 స్థానంలో ఎవరూ ఆడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐదుగురి పేర్లను వన్‌డౌన్‌లో ఆడించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 

1 /5

మూడోస్థానంలో ఆడేందుకు ఎక్కువ అవకాశాలు యశస్వి జైస్వాల్‌కు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఓపెనింగ్ స్థానంలో వచ్చే జైస్వాల్.. దేశవాళీ టోర్నీల్లో మూడోస్థానంలో ఆడుతున్నాడు. ఇటీవల ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా vs మధ్యప్రదేశ్ మ్యాచ్‌లో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 213, 144 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 600కి పైగా పరుగులు సాధించాడు. ఓపెనింగ్ స్లాట్‌లో ఇద్దరు రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్లు ఉండగా.. జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్ కావడం కలిసి వచ్చే అంశం.  

2 /5

వన్‌డౌన్‌లో ఆడించేందుకు ఉన్న మరో ఆప్షన్ రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఓపెనర్‌గా ఆడుతున్న రుతురాజ్‌ను టెస్టుల్లో మూడోస్థానంలో ఆడించొచ్చు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తనను నిరూపించుకునేందుకు గైక్వాడ్‌కు ఇది మంచి అవకాశం.   

3 /5

టీమిండియాకు శుభ్‌మన్‌ గిల్ లాంగ్ టర్మ్ ఆడాల్సి ఉండడంతో ఓపెనింగ్ ప్లేస్‌ నుంచి నెంబర్ 3 కూడా మార్చే యోచన చేయవచ్చు. భవిష్యత్‌లో రుతురాజ్, జైస్వాల్ ఓపెనర్లుగా స్లాట్ బుక్ చేసుకుంటే.. గిల్‌ను మూడోస్థానంలో ఆడించొచ్చు.   

4 /5

ప్రస్తుతం ఐదోస్థానంలో ఆడుతున్న వైస్ కెప్టెన్‌ అజింక్యా రహానే పేరును కూడా మూడోస్థానం కోసం బీసీసీఐ పరిశీలిస్తోంది. 2015లో శ్రీలంకపై వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రహానే శ్రీలంకపై సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

5 /5

సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత నాలుగోస్థానంలో బ్యాటింగ్ ఆడుతున్న కోహ్లీని లాస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. వన్డేల్లో కోహ్లీ మూడోస్థానంలోనే ఆడుతున్నాడు. అయితే టెస్టుల్లో వన్‌డౌన్‌లో కోహ్లీ రికార్డు గొప్పగా లేదు. ఒకవేళ కోహ్లీ మూడోస్థానంలో ఆడితే.. రహానేకు నాలుగో స్థానం ఫిక్స్ అవుతుంది.