Top 5 Places: దేశమంతా ఆతృతతో ఎదురుచూసే హోలీ పండుగ వచ్చేస్తోంది. మార్చ్ 25వ తేదీన హోలీ ఉంది. ఈసారి హోలీకు లాంగ్ వీకెండ్ తోడు కానుంది. మార్చ్ నెల వాతావరణం కూడా అనువుగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండదు. చలి ఎక్కువగా ఉండదు. వర్షాలుండవు. వీకెండ్ ప్లాన్ చేయాలంటే మంచి అవకాశం.
ధర్మశాల ధర్మశాల హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన నగరం. ఈ నగరం ప్రకృతి అందానికి, రమణీయతకు పేరుగాంచింది. ప్రశాంతమైన వాతావరణం, టిబెట్ సంస్కృతిని చూడవచ్చు. మార్చ్ నెలలో ఇక్కడి వాతావరణం చాలా అనువుగా ఉంటుంది.
గుల్‌మర్గ్ గుల్‌మర్గ్ అనేది జమ్ము కశ్మీర్‌లోని సుప్రసిద్ధ హిల్ స్టేషన్. మంచుతో కప్పుకున్న కొండ ప్రాంతాలు, స్కయింగ్, గొండోలా రైడ్ చాలా ప్రసిద్ధి. మీ వీకెండ్‌ను మర్చిపోలేని అనుభూతిగా మిగుల్చుతుంది.
ఉదయపూర్ ఉదయపూర్ రాజస్థాన్‌లోని ప్రముఖ నగరం. ఇక్కడి సరస్సులు, రాజ ప్రసాదాలు, ప్యాలెస్‌లు చాలా ఫేమస్. సిటీ ప్యాలెస్, జగ్ మందిర్, పిఛౌలా సరస్సు, ఫతేహ్ సాగర్ సరస్సు చాలా ప్రసిద్ధి
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ నేషనల్ పార్క్ ఇది. సపారీ కూడా ఉంది. చాలా రకాల వన్యజీవులు ఇక్కడుంటాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్ ఎంజాయ్‌మెంట్ పొందవచ్చు. మార్చ్ నెల అనువైన సమయం.
తవాంగ్ ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ నగరం. ఈ నగరం బౌద్ధ సంస్కృతి, సాంప్రదాయాలకు, మఠాలకు, ప్రకృతి అందాలకు పేరుగాంచింది. తవాంగ్ పర్యటన కచ్చితంగా మంచి అనుభూతిని ఇస్తుంది.