IPL 2025 Mega Auction: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ ప్లేయర్..!

Royal Challengers Bengaluru IPL 2025: తొలిసారి ఐపీఎల్ టోర్నీని ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. జట్టులోకి స్టార్ ఆటగాళ్లు ఉంటున్నా.. కప్ మాత్రం ఆమడ దూరం ఉంటోంది. అందుకే ఈసారి కప్ కొట్టేందుకు టీమ్‌లో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రిటైర్‌మెంట్ ప్రకటించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్‌ కార్తీక్ స్థానంలో స్టార్ ప్లేయర్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ముగ్గురు ప్లేయర్లు రేసులో ఉన్నారు. వాళ్లేవరంటే..?
 

1 /7

ఆర్‌సీబీకి ఈ సీజన్ వరకు దినేష్‌ కార్తీక్ వికెట్ కీపర్‌గా.. ఫినిషర్‌గా సేవలు అందించాడు. వచ్చే సీజన్‌కు దినేష్‌ కార్తీక్‌ స్థానంలో బలమైన ఆటగాడిని తీసుకోవాలని చూస్తోంది.  

2 /7

త్వరలోనే మెగా వేలం జరగనుంది. స్టార్ ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. దీంతో స్ట్రాంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ను వేలంలో దక్కించుకునేందుకు లెక్కలు వేస్తున్నారు.  

3 /7

దినేష్ కార్తీక్ ప్లేస్‌ను భర్తీ చేసేందుకు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ ప్రముఖంగా వినిపిస్తోంది.  

4 /7

లక్నో జట్టును కేఎల్ రాహుల్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేస్తే.. వేలంలో ఎంత ఖర్చు చేసి అయినా దక్కించుకోవాలని ఆర్‌సీబీ చూస్తోంది.  

5 /7

వికెట్ కీపింగ్‌తోపాటు రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది. అందుకే మొదటి ఛాయిస్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలని భావిస్తోంది.  

6 /7

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ పేరు కూడా పరిశీలిస్తోంది. పవర్ హిట్టర్ కావడంతో వేలంలో ఆర్‌సీబీ కన్నేసే అవకాశం ఉంది.  

7 /7

వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మను కూడా తీసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు యంగ్ కీపర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేలంలోకి వస్తే ఆర్‌సీబీ తీసుకునే ఛాన్స్ ఉంది.