IRCTC Special Train: ఇండియన్ రైల్వే లగ్జరీ యాత్రకు సంబంధించి అద్భుతమైన బహుమతి అందిస్తోంది. ఐఆర్సీటీసీ తరపు నుంచి ఆధ్యాత్మిక యాత్రల్ని ప్రోత్సహిస్తూ శ్రీ రామాయణ యాత్రలో అత్యద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ యాత్ర మొదటి ట్రైన్ ఇవాళ ఢిల్లీలోని సఫ్ధర్‌గంజ్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. శ్రీరాముడికి సంబంధించిన మహత్వపూర్వకమైన ధార్మిక ప్రాంతాల్ని సందర్శింపజేస్తుంది ఈ యాత్ర. ఈ ట్రైన్ లోపలి ఫోటోలు చూస్తే మాత్రం కచ్చితంగా స్టార్ హోటల్ సౌకర్యాలు తలదన్నేలా ఉన్నాయి.
ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి అయోధ్య, సీతామఢి, చిత్రకూట్, నాసిక్, రామేశ్వరం సహా రాముడికి సంబంధించిన అన్ని దర్శనీయ క్షేత్రాల మీదుగా నడుస్తుంది. మొత్తం 16 రోజుల యాత్ర తరువాత 17వ రోజున తిరిగి ఢిల్లీ చేరుతుంది. ఈ పదహారురోజుల్లో దాదాపు 7 వేల 5 వందల కిలోమీటర్ల ప్రయాణం పూర్తవుతుంది.
ఒకవేళ మీకు కూడా ఈ ట్రైన్ ప్రయాణం చేయాలనుకుంటే IRCTC అధికారి వెబ్‌సైట్ https://www.irctctourism.com ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం 8287930202, 8287930299, 8287930157 నెంబర్లను సంప్రదించవచ్చు.
ఈ ప్రత్యేక పర్యాటక రైలు భారత ప్రభుత్వ ఆధీనంలోని పర్యాటక శాఖ నుంచి దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా నడుపుతోంది. ఫస్ట్‌క్లాస్ ఏసీకు 1 లక్షా 2 వేల 95 రూపాయలు మాత్రమే. అదే సెకండ్ క్లాస్‌కు 82 వేల 950 రూపాయలుంది. ఈ ప్యాకేజ్‌లో నాణ్యమైన శాకాహారభోజనం, ఏసీ బస్సులు, ఏసీ హోటళ్లలో బస, పర్యాటక ప్రాంతాల సందర్శన, గైడ్ వ్యవస్థ ఉంటాయి.
ఐఆర్సీటీసీ సమాచారం ప్రకారం, ఈ డీలక్స్ ఏసీ ట్రైన్‌లో రెండు రకాల కోచ్ లున్నాయి. ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ, భద్రత కోసం ట్రైన్‌లో సీసీటీవీ కెమేరాలున్నాయి. ప్రతి కోచ్‌కు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. ట్రైన్‌లో రెండు డైనింగ్ రెస్టారెంట్లు, మోడర్న్ కిచెన్, షవర్‌బాత్ వ్యవస్థ ఉంటుంది.
ఆధునిక వసతులతో కూడిన ఫుల్ ఏసీ ట్రైన్‌లో యాత్రికుల కోసం చాలా మంచి సౌకర్యాలున్నాయి. ఈ ట్రైన్‌లో రెండు డైనింగ్ రెస్టారెంట్లు, ఒక ఆధునిక కిచెన్ కార్ ఏర్పాట్లున్నాయి. అంతేకాకుండా ప్రయాణీకుల కోసం ఫుట్ మసాజర్, మినీ లైబ్రరీ, ఆధునిక టాయ్‌లెట్, షవర్‌బాత్ వంటి సౌకర్యాలున్నాయి. దాంతోపాటు భద్రత కోసం గార్డు, ఎలక్ట్రానిక్ లాకర్ సీసీటీవీ కెమేరా వసతులున్నాయి.