Tesla Cars: ఇండియాలో టెస్లా కారు వస్తుందా లేదా, ప్రభుత్వం విధించిన షరతేంటి

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నాయనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. టెస్లా కార్ల అమ్మకాలకు సంబంధించి భారత ప్రభుత్వం విధించిన షరతులకు టెస్లా ఇంకా అంగీకారం తెలుపలేదు. ఈ క్రమంలో ఆ షరతులేంటి..ఎప్పుడు టెస్లా ఇండియాలో ఎంట్రీ ఇవ్వనుందో తెలుసుకుందాం..

Tesla Cars: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నాయనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. టెస్లా కార్ల అమ్మకాలకు సంబంధించి భారత ప్రభుత్వం విధించిన షరతులకు టెస్లా ఇంకా అంగీకారం తెలుపలేదు. ఈ క్రమంలో ఆ షరతులేంటి..ఎప్పుడు టెస్లా ఇండియాలో ఎంట్రీ ఇవ్వనుందో తెలుసుకుందాం..
 

1 /5

పన్ను రాయితీ విషయంపై ఇండియా విధించిన షరతుకు టెస్లా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. టెస్లా కంపెనీ స్పందనపైనే ఆ కంపెనీ కార్లు ఇండియాలో ఎప్పుడు మార్కెట్‌లో వస్తాయనేది ఆధారపడి ఉందిప్పుడు. 

2 /5

ఇండియాలో కార్ల తయారీకు సంబంధించి స్పష్టమైన వైఖరి చెప్పకుండా, టెస్లా అనుసరిస్తున్న వైఖరిపై కేంద్రం సీరియస్ అయింది. ఇండియాలో టెస్లా కార్ల తయారీ యూనిట్ ప్రారంభించిన తరువాతే పన్ను రాయితీ ఇస్తామని స్పష్టం చేసింది. 

3 /5

కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడంతో కార్లను ఇండియా మార్కెట్‌లో దింపేందుకు టెస్లా ఆలోచిస్తోంది. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముందుగా విదేశాల్లో తయారైన కార్లను ఇండియాలో దిగుమతి చేసుకుని..ఆ అమ్మకాలు పూర్తయిన తరువాత తయారీ ప్లాంట్లు నెలకొల్పుతామని టెస్లా చెబుతోంది. 

4 /5

విదేశాల్లో పూర్తిగా తయారైన కార్లను ఇండియాలో దిగుమతి చేసుకుంటే ఇంజన్ సామర్ధ్యం, ధర వంటి విషయాల ఆధారంగా కారు ధరలో 60 నుంచి 100 శాతం వరకూ దిగుమతి సుంకాన్ని విధిస్తోంది భారత ప్రభుత్వం. పర్యావరణానికి మేలు కల్గించే ఎలక్ట్రిక్ కార్లు కాబట్టి పన్ను మినహాయింపు ఇవ్వాలనేది టెస్లా కోరిక. కార్ల యూనిట్ ఇండియాలో పెడితేనే పన్ను రాయితీ అంశం పరిశీలిస్తామనేది కేంద్ర ప్రభుత్వం విధించిన షరతు.

5 /5

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఇండియా మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న టెస్లా కంపెనీ..భారత ప్రభుత్వం విధించిన షరతులకు సమాధానం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కార్ల అమ్మకంపై టెస్లాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత ప్రభుత్వం.