Jio: జియో 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ మాత్రమే కాదు.. మరిన్ని బెనిఫిట్స్‌..

Jio Affordable Plan: ప్రైవేటు దిగ్గజ కంపెనీ జియో తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోటీగా జియో అందిస్తున్న బంపర్‌ ప్లాన్స్‌ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జియో అందిస్తోన్న 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తోపాటు మీరు ఎన్ని బెనిఫిట్స్‌ పొందుతారు తెలుసుకోండి.
 

1 /5

జియో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్లాన్స్‌ తీసుకువస్తుంది. 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ అంటే ఏకంగా 11 నెలలపాటు ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ వస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే దగ్గరదగ్గర ఏడాది వరకు మీకు రీఛార్జీ టెన్షన్‌ కూడా ఉండదు.  

2 /5

ఈ ప్లాన్‌ ధర రూ.1234 మాత్రమే ఇందులో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. ఇది కాకుండా 500 ఎంబీ హైస్పీడ్‌  డేటా పొందుతారు. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఏ నెట్‌వర్క్‌ అయినా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రీ రోమింగ్‌ కూడా పొందవచ్చు.  

3 /5

జియో అందిస్తోన్న ఈ బంపర్‌ ప్లాన్‌లో మీరు జియో సావన్‌, జియో సినిమా కూడా పొందుతారు. అయితే, ఈ ప్లాన్‌ కేవలం జియో భారత్‌ ఫోన్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మాములు స్మార్ట్‌ ఫోన్‌ కస్టమర్లు ఈ ప్లాన్‌ బెనిఫిట్స్‌ పొందలేరు.  

4 /5

జియో అందిస్తోన్న ఈ బడ్జెట్‌ ఫ్రెండ్లీ 336 రోజుల ప్లాన్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు పరిచయం చేసింది ఈ ప్లాన్‌ వ్యాల్యూ కేటగిరీలోకి వస్తుంది. జియో వెబ్‌సైట్‌ ద్వారా  ప్లాన్‌ రీఛార్జీ అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ 3,600  ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్‌ డేటా ఉండదు.  

5 /5

జియో పరిచయం చేసిన మరో ఈ ప్లాన్‌ రూ.1748 మాత్రమే. వ్యాలిడిటీ 336 రోజుల వర్తిస్తుంది. ఇది స్మార్ట్‌ పోన్‌ యూజర్లకు అందిస్తోన్న బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్లాన్‌. జియో ఇటీవలె వాయిస్‌ ఓన్లీ ప్లాన్స్ కూడా పరిచయం చేసింది. ఇది ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించేవారికి బెస్ట్‌.