Jio Superhit plan: జియో దీపావళి ధమాకా ఆఫర్స్‌.. రూ.899 రీఛార్జీ ప్యాక్‌పై రూ.3,350 బెనిఫిట్స్‌..

Jio Diwali Dhamaka Offers: దీపావళి పండుగ అతి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో జియో తమ యూజర్ల కోసం ఆకట్టుకునే కళ్లు చెదిరే ప్యాక్‌ ముందుకు తీసుకు వచ్చింది. ఈ ఆఫర్‌ ద్వారా రూ.3,350 బెనిపిట్స్‌ పొందుతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

జియో దీపావళి ధమాకా ఆఫర్‌ పొందాలంటే రూ.899 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకోవాలి. ఇందులో 5జీ,  స్పీడ్‌ 2 జీబీ డేటా ప్రతిరోజూ అందుకుంటారు. లేదా 4జీ స్పీడ్‌ 20 జీబీ అదనంగా పొందుతారు. ఇది ఏడాది ప్లాన్‌ అయిన రూ.3,599 లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో ప్రతిరోజూ 2.5 జీబీ డేటా 4 జీ,5జీ స్పీడ్‌ నెట్‌ అందుబాటులో ఉంటుంది.  

2 /5

ఇందులో అదనంగా ఇతర రీఛార్జీ ప్లాన్ల మాదిరి ఇందులో కూడా జియో యాప్స్ ఉచితంగా పొందుతారు. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు.  

3 /5

ఈ రెండూ రూ.899, రూ.3,599 రీఛార్జీప్లాన్‌పై జియో ఏజియోలో షాపింగ్‌ చేస్తే రూ.200 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఇస్తుంది.  

4 /5

హోటల్‌ బుకింగ్‌ కు ఈజ్‌ మై ట్రిప్‌ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే రూ.3000 ఆఫర్‌ పొందుతారు. స్వీగ్గీ ద్వారా రూ.300 అంతకు ఎక్కువ ధరలో ఫుడ్‌ బుక్‌ చేసుకుంటే రూ.150 ఆఫర్ లభిస్తుంది.  

5 /5

మైజియో యాప్‌  ఓచర్స్‌ సెక్షన్‌లోని 'మై విన్నింగ్స్‌' లో ఇవి అందుబాటులో ఉంటాయి. కూపన్‌ కాపీ చేసుకుని షాపింగ్‌ చేసి ఈ బెనిఫిట్స్‌ పొందవచ్చు. అయితే, ఈ  రీఛార్జీ ప్లాక్‌లను నవంబర్‌ 5వ తేదీలోపే తీసుకోవాలి.