Keerthy suresh akka: కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన అక్క టీజర్ విడుదలైంది. దీనిలో మహానటి డిఫరెంట్ లుక్ లో కన్పించి అందర్ని షాకింగ్ కు గురిచేసింది.
కీర్తిసురేష్ ఇప్పటి వరకు నటించని పవర్ ఫుల్ పాత్రలో.. అక్క మూవీలో కన్పించనున్నారు. ఈ వెబ్ సిరిస్ కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ఈ క్రమంలో మహానటి నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ లతో ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పటి వరకు క్యూట్‌గా మాత్రమే కన్పించిన మహానటి అక్క మూవీలో మాత్రం పవర్ ఫుల్ పాత్రలో కన్పించనున్నారు. ఈ సినిమాలో.. రాధిక ఆప్టే డిఫరెంట్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్నారు.
ఈ టీజర్ లో కీర్తిసురేష్.. మగాళ్ల మధ్య శివంగిలా కన్పిస్తున్నారు. పెళ్లాయ్యాక చాలా మంది కీర్తిసురేష్ సినిమాలకు దూరమౌతారని చాలా మంది కామెంట్లు చేశారు. అలాంటి వారికి ఈ టీజర్‌తో మహానటి బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకొవచ్చు.
ఇప్పటికే కీర్తిసురేష్ బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈమూవీ మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే.. తాజాగా విడుదలైన అక్క టీజర్ మాత్రం.. కీర్తిసురేష్ పాత్రపై ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు.
కీర్తిసురేష్ ఫెస్ ఎక్స్ ప్రెషన్స్, ఆమె డేరింగ్ ఎంట్రీ టీజర్ చూస్తుంటే అభిమానులకు గూస్ బంప్స్ వస్తున్నాయి. దీంతో కీర్తిసురేష్ అక్కమూవీ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
మహానటి ఇప్పటికే తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైయ్యాక కూడా మహానటి గ్లామర్ డోస్ ను ఏమాత్రం తగ్గించలేదు. అక్క మూవీలో సైతం కీర్తిసురేష్ ఫుల్ గ్లామర్ డోస్ తో రెచ్చిపోయిందని టాక్ నడుస్తొంది.