Ketu Gochar 2024: కేతుగోచారం ఈ రాశిపై 10 నెలలు.. ఈ పరిహారంతో భారీ ఉపశమనం..

Ketu Gochar 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహుకేతువులను అశుభ గ్రహాలుగా పరిగణిస్తారు. ఇవి జాతకంలో ఉంటే అనేక సమస్యలు వస్తాయి. అయితే, కేతు గోచారం వల్ల ఏ రాశికి అశుభమో తెలుసుకుందాం. దీనికి కొన్ని పరిహారాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.
 

1 /5

ప్రస్తుతం కేతువు కన్య రాశిలో ఉన్నాడు. 2025 మే వరకు ఈ రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత కేతు గ్రహం రాశిని మారుస్తుంది. ఈ నేపథ్యంలో కన్యరాశికి కేతు గ్రహం నుంచి విముక్తి కలుగుతుంది. అయితే, ఈలోగా కేతు గ్రహ పీడ నుంచి విముక్తికి కొన్ని పరిహారాలు ఉన్నాయి.  

2 /5

కన్యరాశివారు ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నట్లయితే, పనిచేసే ప్రదేశంలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిత్యం ఈ ఆదిదేవుని పూజ చేస్తూ ఉండాలి. గణేశునికి ప్రత్యేకమైన రోజు బుధవారం. ఈరోజు గరిక సమర్పించాలి.  

3 /5

ఎందుకంటే కన్య రాశి వారికి పూజ్యమైన దేవుడు గణేశుడిని భావిస్తారు. ఆయనకు ఇష్టమైన ప్రసాదాలను పెట్టాలి. ముఖ్యంగా ఈరోజు గణేష్ చాలీసా పఠించండి.ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది.  

4 /5

ప్రతిరోజూ స్నానం చేసిన వెంటనే వినాయకుని పూజించాలి. వీలైతే ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గణేశా విగ్రహానికి అభిషేకం చేయాలి. గంగాజలతో చేస్తే మరింత మంచిది.   

5 /5

ముఖ్యంగా జాతకంలో ఎప్పుడైనా అశుభ గ్రహాలు ఉంటే బుధవారం ఆవుకు గడ్డి తినిపించాలి. దీంతో జాతకంలో బుధుడు బలంగా మారతాడు. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. అభివృద్ధికి అడ్డంకులు ఉండవు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)