Kitchen Ingredints for Healthy skin: మన ముఖం అందంగా కనిపించడానికి పార్లర్లకు వెళ్తాం. ఎన్నో వేలు ఖర్చు పెట్టి వస్తువులు కొనుగోలు చేస్తాం. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో మీరు నిత్యయవ్వనంగా కనిపిస్తారు. అంతేకాదు, మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
మిలమిలా మెరిసే చర్మం కోసం ఎన్నో వస్తువులు ఉపయోగిస్తారు అయితే మీ చర్మం మార్గంగా కనిపించడానికి వంటింటి వస్తువులు ఏమున్నాయో తెలుసుకున్నాం.
నెయ్యి.. ఆరోగ్యంగా ఉంటారు అని పూర్వికులు చెప్తారు. అయితే ఇది మన శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది శరీరారోగ్యానికి సహాయపడుతుంది అంతేకాదు నెయ్యిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ శాతం ఉంటాయి. మోనోశాచురేటెడ్ ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఆరోగ్యకరమైన గుండెకు కార్డియో వ్యవస్థకు సహాయపడుతుంది. ప్రతిరోజు మీ ముఖానికి నెయ్యి అప్లై చేయడం వల్ల ముఖానికి ఆ మాయిశ్చర్ అందుతుంది. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు ముఖంపై లైన్స్ ని తొలగిస్తుంది.
ఫ్రెష్ క్రీమ్.. ప్రత్యేకంగా ఫ్రెష్ క్రీమ్ తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ మీ స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల మీ ముఖానికి మాయిశ్చర్ అందుతుంది దీంతో ముఖం మృదువగా మారుతుంది ఇది లోతైన పోషణను అందిస్తుంది అంతేకాదు ముఖంపై ఉన్న టాక్సిన్స్ ని తొలగిస్తుంది.
పసుపు.. పసుపు కూడా మన వంటగదిలో ఉండే వస్తువు ఇందులో యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే కర్కూమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ప్రతి వారంలో రెండు సార్లు రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో పసుపు వేసుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న టాన్ తొలగిపోయి ముఖం రుదువుగా మెరుస్తూ కనిపిస్తుంది.
తేనె.. తేనే కూడా ముఖానికి పర్ఫెక్ట్ రంగును అందిస్తుంది తేనే యాంటీ బ్యాక్టీరియా లాంటి ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియన్ గుణాలు కలిగి ఉంటుంది చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
యోగర్ట్.. యోగర్ట్ లో కూడా ఎన్నో ఆరోగ్య గుణాలతో పాటు చర్మ వారికి ఎంతో మేలు చేసే గుణాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్ విటమిన్స్ క్యాల్షియంటిక్స్ ఆరోగ్యకరమైన శరీరంతో పాటు మెరిసే చర్మాన్ని కూడా అందిస్తుంది