Kira narayanan: ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ యాంకర్ కిరా నారాయణన్ స్టైల్ చూస్తారా..అసలు ఎవరీమె

ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఒక్కొక్కరికి ఒక్కో ఆటగాడిపై అభిమానం. ఒక్కొక్కరూ ఒక్కొక్కరి ఆటపై దృష్టి పెడుతుంటారు. కానీ ఇదే సిరీస్‌లో అందరి కళ్లు పడుతోంది మాత్రం యాంకర్ కిరా నారాయణన్‌పైనే. టీవీలో బ్రేక్ సందర్బంగా కన్పించే కిరా నారాయణన్ ( Kira narayanan)ఎవరసలు..తెలుసుకుందామా...

Kira narayanan: ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఒక్కొక్కరికి ఒక్కో ఆటగాడిపై అభిమానం. ఒక్కొక్కరూ ఒక్కొక్కరి ఆటపై దృష్టి పెడుతుంటారు. కానీ ఇదే సిరీస్‌లో అందరి కళ్లు పడుతోంది మాత్రం యాంకర్ కిరా నారాయణన్‌పైనే. టీవీలో బ్రేక్ సందర్బంగా కన్పించే కిరా నారాయణన్ ( Kira narayanan)ఎవరసలు..తెలుసుకుందామా...

1 /5

2018లో కిరా నారాయణన్ కౌలాలంపూర్ నుంచి ముంబాయికు వచ్చింది. ప్రొఫెషనల్ యాక్టిక్ కెరీర్ ప్రారంభించింది. ప్రో కబడ్డీ లీగ్‌ కు యాంకరింగ్ చేసింది. 

2 /5

కిరా నారాయణన్ లండన్ యూనివర్శిటీ కాలేజ్ నుంచి బీఎస్సీ సైకాలజీ చదివింది. దాంతోపాటే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ డిప్లొమో పూర్తి చేసింది. గ్రేట్ బ్రిటన్‌లోని నేషనల్ యూత్ థియేటర్ సభ్యురాలు కూడా.

3 /5

కిరా నారాయణన్ యాంకర్ మాత్రమే కాదు ఒక నటి కూడా. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో పెరిగింది. 13 ఏళ్ల వయస్సు నుంచే యాక్టింగ్ ప్రారంభించింది. 

4 /5

ఐపీఎల్ 2020 సందర్బంగా కిరా నారాయణన్ క్రికెట్ లైవ్ షోలో యాంకర్‌గా ఇప్పటికే వ్యవహరించింది. ఈ టోర్నమెంట్‌లో బ్రెట్ లీ, బ్రియన్ లారా,  వంటి దిగ్గజ క్రికెటర్లు ఆమెతో కలిసి యాంకరింగ్ హోస్ట్ చేస్తున్నారు. 

5 /5

కిరా నారాయణన్ ఇటీవల ఇండియా ఇంగ్లండ్ సిరీస్‌లో సునీల్ గవాస్కర్‌ ( Sunil Gavaskar)తో కలిసి లైవ్ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తోంది. క్రికెట్ అభిమానులు ఆమె కాన్ఫిడెన్స్‌పై ఫిదా అవుతున్నారు. లిటిల్ మాస్టర్‌తో కలిసి ఇద్దరి జుగల్ బందీ అద్భుతంగా ఉంటోంది.