Upcoming IPOs: దేశీయ స్టాక్ మార్కెట్ల పెట్టుబడిదారులు ముదిరిపోయారు. గతంలో మాదిరిగా ఎక్కువగా ఈక్వీటిలపై ఫోకస్ పెట్టడం లేదు. దీనికి బదులుగా డబ్బు రెట్టింపు చేస్తున్న ఐపీవోలపై గురి పెడుతున్నారు. వరుస ఐపీవోలు బెట్టింగ్ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నాయి. తాజాగా ఆగస్టు నెలలో ఈ స్తటిక్ ఇంజనీర్స్ ఐపీఓ మార్కెట్లోకి ప్రవేశించేందుకు రెడీ అయ్యింది.
Upcoming IPO Esthetic Engineers ఆగస్టు నెలలో కొత్త ఐపీఓల సందడితో ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. ఇప్పటికే ఆగస్టు నెల ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ప్రారంభం అవ్వగా, ప్రస్తుతం మరికొన్ని ఐపీవోలు కూడా ప్రైమరీ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఆగస్టు 8వ తేదీ నుంచి ఈ స్తటిక్ ఇంజనీర్స్ ఐపీఓ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమయింది. ఈ కంపెనీ 26.47 కోట్ల రూపాయలను ఐపిఓ ద్వారా సమీకరించాలని సిద్ధం అయింది. మొత్తం 45.64 లక్షల షేర్ లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు.
ఈ షేర్లకు సంబంధించి కీలకమైన తేదీల విషయానికి వస్తే, ఐపిఓ ఆగస్టు 8వ తేదీ ప్రారంభం కానుంది అలాగే ఆగస్టు 12వ తేదీన ఈ ఐపీఓ ముగియనుంది. ఇంకా ఆగస్టు 13వ తేదీన షేర్ల అలాట్మెంట్ జరుగుతుంది. షేర్లు ఎవరికైతే లభిస్తాయో వారికి ఆగస్టు 14వ తేదీన డిమార్ట్ అకౌంట్ లలో క్రెడిట్ అవుతాయి. అయితే ఎవరికైతే షేర్లు దక్కవో వారికి అదే రోజు రిఫండ్ లభిస్తుంది. ఇక స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ ఆగస్టు 16వ తేదీన లిస్టింగ్ జరుపుకోనున్నాయి.
ఈ షేర్ల ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే పది రూపాయల ముఖ విలువ గల ఈ షేర్లను కనిష్టంగా 55 రూపాయలు గరిష్టంగా 58 రూపాయలు వరకు వెడ్డింగ్ వేసుకోవచ్చు మినిమం ఒక లాట్ సైజులో కనీసం 2000 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది అంటే ఒక లక్ష 16 వేల రూపాయల ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది
కంపెనీ విషయానికి వస్తే: ఈస్థెటిక్ ఇంజనీర్స్ లిమిటెడ్ 2003లో ప్రారంభించారు. కంపెనీ ఇంటీరియర్ డిజైన్ సేవలను అందిస్తుంది, మాన్యుఫాక్చర్, అలాగే ఇన్‌స్టాలేషన్ విభాగంలో సేవలు అందిస్తోంది. హాస్పిటాలిటీ, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం ఆర్కిటెక్చరల్ డివైజెస్, అల్యూమినియం తలుపులు, కిటికీలు అలాగే రెయిలింగ్‌లు, మెట్లు, Glassfibre Reinforced Concrete (GFRC) తో తయారు చేసే డిజైన్, ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్, ఇన్‌స్టాలేషన్ సేవలను కంపెనీ అందిస్తుంది.
Aesthetik ఇంజనీర్స్ ఆస్తులు ఇవే: కంపెనీ ఉత్పత్తి కేంద్రం కోల్‌కతాలోని హౌరాలో ఉంది. కంపెనీ యూనిట్ మొత్తం 3,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉంది. జూన్ 30, 2024 నాటికి, కంపెనీలో 52 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.