BRS Party Leaders Stands With HYDRAA Victims: మూసీ ప్రాజెక్ట్ పేరుతో తమ ఇళ్లు కూలుస్తుండడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వారికి ధైర్యం.. భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ బృందం రంగంలోకి దిగింది. గులాబీ బృందం బాధితుల వద్దకు వెళ్లి భరోసానివ్వడంతో స్థానికులు కొంత ఊరట చెందారు.
పూర్తి భరోసా: ఏ ఉదయం వచ్చి తమ ఇళ్లు కూల్చివేస్తారేమోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్న ప్రజలు.. తమ ఇల్లు ఎప్పుడూ కూలుస్తారేనని.. ఎప్పుడూ తమ ప్రాంతంలోకి బుల్డోజర్లు దూసుకొస్తాయోనని హైరానా పడుతున్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ధైర్యం ఇచ్చింది.
బాధితులకు అండగా: హైడ్రా బుల్డోజర్లతో హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. భయంభయంతో బతుకుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ భరోసా లభించింది.
రెండు ప్రాంతాల్లో: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్గూడ, కిషన్బాగ్లలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను సోమవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.
గులాబీ దండు: క్షేత్రస్థాయిలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు పర్యటించి హైడ్రా బాధితులకు ధైర్యం ఇచ్చారు.
బాధితులకు భరోసా: రాజేంద్రనగర్ పరిధిలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసిన మాజీమంత్రులు వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు.
బాధితులతో మాటామంతీ: కిషన్ బాగ్ పరిధిలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కూడా కలిసి వారికి మేమున్నామని అండగా నిలిచారు.
బాధితుల గోడు: బీఆర్ఎస్ బృందంతో స్థానిక ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కన్నీటిపర్యంతమయ్యారు.
హైడ్రాపై ఆగ్రహం: హైడ్రా కూల్చివేతలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు.
అనూహ్య స్పందన: బీఆర్ఎస్ బృందానికి సందర్శనకు స్థానికుల నుంచి భారీగా మద్దతు లభించింది. తమకు అండగా నిలవాలని.. న్యాయం చేయాలని స్థానికులు కోరారు.