August 1st New Rule:ప్రతి నెల ఒకటో తేదీ రావడంతోనే అనేక కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమల్లోకి రావడం అనేది మనం అందరం గమనిస్తూనే ఉంటాం. ముఖ్యంగా బ్యాంకింగ్ , ఆదాయపన్ను వంటి విభాగాల్లో చేసిన మార్పులు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి మార్పులను తెలుసుకుందాం.
Rule Change From 1st August: ఆగస్టు ఒకటో తేదీ నుంచి మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సంబంధితమైన అంశాలతో ముడిపడి ఉంటారో అలాగే ఉద్యోగస్తులు విద్యార్థులు, గృహిణులు, వ్యాపారస్తులు ఇలా అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ప్రతి నెల ఒకటో తేదీ రోజు పలు రకాల మార్పులను ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి నెల ఒకటవ తేదీన అనేక నియమ నిబంధనలను ప్రవేశపెడుతూ ఉంటాయి.
ఏదైనా కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలన్నా కూడా అందుకు ఒకటవ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పలు రకాల మార్పులు వస్తున్నాయి అలాంటి మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని మీరు ముందుగానే తెలుసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ నెల మీరు గడపవచ్చు. లేదా మీరు చేయాల్సిన పనులను ముందుగానే సిద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి వచ్చే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరల మార్పు: ప్రతి నెల ఒకటవ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాము సరఫరా చేసే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను రివైజ్ చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా గృహ ఉపయోగ సిలిండర్లు. వాణిజ్య సిలిండర్ లను మార్చుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు ఈనెల 1వ తేదీన కూడా మార్పులకు గురయ్యాయి ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ లను ఈనెల భారీగా తగ్గించారు. కానీ గృహ ఉపయోగ సిలిండర్లు మాత్రం ధరలు ఎలాంటి మార్పు లేదు. అయితే ఆగస్టు 1వ తేదీన కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉంటాయి. . మరి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ధరలను స్థిరంగా ఉంచుతాయా హెచ్చుతగ్గులకు గురిచేస్తాయి అనేది రేపు మనకు తెలుస్తుంది.
HDFC క్రెడిట్ కార్డు నియమాల్లో మార్పులు: HDFC క్రెడిట్ కార్డు నియమాలకు సంబంధించి పలు రకాల నియమ నిబంధనలు అనేవి రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు పొందిన వ్యక్తులు ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎవరైతే రెంట్ చెల్లిస్తారో వాటిపై ఒక శాతం వరకు చార్జీలు వర్తిస్తాయి. అలాగే ఎవరైతే ఎడ్యుకేషనల్ ఫీజులను ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డు ను ఉపయోగించి చెల్లిస్తారో, ఆచార్జీలపై కూడా ఒక శాతం వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే పిఓఎస్ మిషిన్ల ద్వారా మాత్రం మినహాయింపు అందించారు.
Fastag నియమాల్లో మార్పులు: ఎవరైతే ఐదు సంవత్సరాల క్రితం Fastag నమోదు చేసి ఉన్నారు వారంతా మరోసారి కేవైసీ ద్వారా అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది.