Liquor Rates Hike: ఇప్పటికే పెరిగిన నిత్యావరసరాల ధరలతో విసిగి వేసారిన సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కొంత మంది కాస్తంత రిలాక్స్ కోసం అపుడపుడు మద్యం పుచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝలిపించింది. అంతేకాదు బీర్ల ధరలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Liquor Rates Hike: తెలంగాణలో బీరు ధరలను పెంచి మద్యం బాబుకు బిగ్ షాక్ ఇవ్వబోతుంది తెలంగాణ సర్కార్. అంతేకాదు మద్యంపైన 15 నుంచి 20 శాతం రేట్ల పెంపుకు సిద్దమవుతుంది.
ఇందుకు సంబంధించిన ధరల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చీప్ లిక్కర్, బ్రాంది, విస్కీ, రమ్, వైన్ ప్రీమియం విదేశీ మద్యం రేట్లను సర్కార్ భారీగా పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పెంపుపై త్వరలోనే ఉత్తర్వులు వెలుబడే అవకాశాలున్నాయి.
తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ ధరలు పెంచేందుకైతే సర్కార్ సిద్ధమైంది. ఇటీవలే ఆ బీర్ల రేట్లు మాత్రం 15 నుంచి 20% పెంచగా అదే తరహాలో ఇటు లిక్కర్ ధరలను సైతం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తంగా ఈ పెంపుతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
మొత్తంగా చీఫ్ లిక్కర్ తోపాటు బ్రాండీ, విస్కీ, రమ్ ధరలు కూడా భారీగా పెరకబోతున్నట్టు సమాచారం. చీఫ్ లిక్కర్ కూడా కాస్తంత పెంచే యోచనలో సర్కారు ఉంది.
వచ్చేది ఎండా కాలం కాబట్టి బీర్లకు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో బీర్ల ధరలను సాధ్యమైనంత మేర పెంచి ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్ల నుంచి వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ధరలు పెంచినా.. పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాదనే అభిప్రాయం ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.
మద్యం దుకాణ దారులకు కూడా ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువ మద్యం అమ్మేవారికి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది.