Instant Oats Dosa For Weight Loss: ఓట్స్ అధునిక కాలంలో ఎంతో పేరు పొందిన ఆహారం. దీని చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌లో ఒక భాగంగా తీసుకుంటారు. కానీ కొంతమంది దీని తినడానికి ఇష్టపడరు. అయితే దీని ఉపయోగించి దోశను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని తినడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Instant Oats Dosa For Weight Loss: ఇన్స్టంట్ ఓట్స్ దోశ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ డిష్. ఈ రెసిపీని అతి తక్కువ సమయంలో సలుభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఓట్స్ ఫైబర్, ప్రోటీన్ ఇతర ముఖ్యమైన పోషకాలకు శరీరానికి మేలు చేస్తాయి. ఓట్స్ దోశలో ఫైబర్, కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతాయి. బరువు తగ్గాలి అనుకొనేవారికి ఇది అద్భుమైన ఆహారం. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి? ఈ రెసిపీతో బరువు ఎలా తగ్గవచ్చు? అనేది తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం: ఓట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు నియంత్రణ: ఓట్స్ ఫైబర్‌తో నిండి ఉంటుంది, ఇది మనల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది, తద్వారా అనవసరమైన తినడం నిరోధిస్తుంది.
జీర్ణ వ్యవస్థ: ఓట్స్ జీర్ణ వ్యవస్థకు మంచిది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు: 1 కప్పు ఇన్స్టంట్ ఓట్స్, 1/2 కప్పు పెరుగు, /4 కప్పు నీరు, 1/4 కప్పు రవ్వ, 1 ఆకు కొత్తిమీర చిన్నగా తరిగినది
కావలసిన పదార్థాలు: 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/4 కప్పు క్యారెట్ ముక్కలు, 1/4 కప్పు బీన్స్ ముక్కలు, ఉప్పు రుచికి తగినంత, నూనె వేయడానికి
తయారీ విధానం: ఒక పాత్రలో ఓట్స్, రవ్వ, పెరుగు, నీరు, ఉప్పు వేసి బాగా కలపండి. 15-20 నిమిషాలు నానబెట్టండి.
నానబెట్టిన మిశ్రమానికి ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, కొత్తిమీర వేసి మళ్ళీ బాగా కలపండి.
ఒక నాన్-స్టిక్ పాన్‌ను వేడి చేసి, కొద్దిగా నూనె వేసి తగినంత మిశ్రమాన్ని వేసి పోరీ వేయండి.
రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
వేడి వేడిగా చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయండి.